రాజీవ్‌ యువ వికాస్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోండి

  • జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కొత్తగూడెం : యువకులు రాజీవ్‌ యువ వికాస్‌ పథకానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్‌(ఈబిసి, ఈడబ్ల్యూఎస్‌) నిరుద్యోగ యువతీ, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకానికి బీసీ, (ఎంబీసీ)సంచార జాతుల వారు, (బీసీ ఫెడరేషన్‌) రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, బట్రాజు, కృష్ణ బలిజ,పూసల సగర, ఉప్పర, వాల్మీకి,బోయ, కుమ్మరి, శాలివాహన, విశ్వబ్రాహ్మణ, మేదర, కల్లుగీత కార్మికులు, గంగపుత్ర, పెరిక, పద్మశాలి, మేర, ముదిరాజ్‌, మున్నూరుకాపు, యాదవ లింగాయత్‌ కులాలకు చెందిన వారు అర్హులని వెల్లడిరచారు. యువతీ, యువకులు ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. tgobmmsnow.cgg.gov.in వెబ్సైట్‌ ద్వారా అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థుల వయస్సు 21 నుండి 55, వ్యవసాయ సంబంధ వృత్తులకు జులై 1 నుండి, 2025 నాటికి 60 సంవత్సరములు నిండి ఉండాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అన్నారు. గ్రామీణ ప్రాంతం వారికి రూ1,50 వేలు, పట్టణ ప్రాంతం వారికి రూ 2లక్షలు వార్షిక ఆదాయం ఉండాలన్నారు. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులని, దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రము జత పరచాలని, వ్యవసాయ ఆధారిత వృత్తులకు పట్టేదారు పాసుపుస్తకం జత చేయాలని, ట్రాన్స్పోర్ట్‌ సెక్టార్‌ (ఆటో, అప్పి ఆటో) వారు పర్మినెంట్‌ లైసెన్స్‌ జతపరచాలని, దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, కులం మరియు ఆదాయ దృవీకరణ పత్రములు, పాస్పోర్ట్‌ సైజ్‌ ఫోటో, పాన్‌ కార్డు జత చేసి వచ్చేనెల 5వ తారీఖు వరకు ఆన్లైన్‌ వెబ్సైట్‌ ద్వారా దరఖాస్తులుకొని, గ్రామీణ ప్రాంతం వారైతే మండల ప్రజాపరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలోనూ, పట్టణ ప్రాంతం అయితే మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి అన్నారు.

ఈ పథకాల కింద సబ్సిడీ యూనిట్‌ విలువ రూ 50 వేల యూనిట్‌కు 100శాతం, రూ 50 వేల పైనుండి లక్షకు 90 శాతం సబ్సిడీ, 10శాతం బ్యాంకు రుణము, రూ లక్ష నుండి 2 లక్షల యూనిట్‌కు 80శాతం సబ్సిడీ, 20శాతం బ్యాంకు రుణం, రూ 2 లక్షల నుండి 4లక్షల యూనిట్‌కు 70శాతం సబ్సిడీ 30శాతం బ్యాంకు రుణం లభిస్తుందని వెల్లడిరచారు. మైనర్‌ ఇరిగేషన్‌ యూనిట్‌కు 100శాతం సబ్సిడీ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ, వెనుకబడిన తరగతుల యువతి, యువకులు వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading