ఇక నుండి జనరల్ అసిస్టేంట్స్
- బదిలీ వర్కర్, జనరల్ మజ్దూర్‌లకు గుడ్ న్యూస్
- డిజిగ్నేషన్ మార్పుకు ఆదేశాలు

సింగరేణి : బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ డెసిగ్నేషన్ వెంటనే రద్దు చేస్తూ పరిశ్రమలలో గౌరవప్రదమైన తోటి కార్మికులతో సమానత్వంగా ఉండేలా జనరల్ అసిస్టెంట్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గని కార్మికులతో కలిసి మాట్లాడుతు సింగరేణి పరిశ్రమలో బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ అనే డిజిగ్నేషన్ సింగరేణి పరిశ్రమ చరిత్రలో ఏళ్ల తరబడి సామాజిక అసమానతలకు గురవుతు సామాజికంగా సమాజంలో సింగరేణి కార్మికులను యాజమాన్య ప్రతినిధులు ఏళ్ళ తరబడి సమాజంలో ఇబ్బంది పెడుతూ కార్మిక బస్తీలలో కూడా తోటి కార్మికులతో అనేక అవస్థలు పడుతూ పిల్లలు చదువుకునే కార్పొరేట్ కాలేజీలలో సోషల్ స్టేటస్ పేరుతో తోటి కార్మికుని పిల్లలను అవమానపరుస్తు జరుగుతున్న అసమానతలను సింగరేణి పర్యటనలో కొత్త కాపు లక్ష్మారెడ్డి గుర్తించారు.
బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ సిఎంపిఎఫ్ ట్రస్ట్రీ బోర్డ్ సభ్యుల ఆదేశాల మేరకు 2024 ఫిబ్రవరి 6న జైసల్మార్ రాజస్థాన్‌లో జరిగిన 2వ స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సమావేశంలో స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సభ్యులు సుధీర్ గురుడే, మజ్రుల్ హక్ అన్సారి, సింగరేణి నుండి యాదగిరి సత్తయ్య సుదీర్ఘంగా కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యంతో చర్చించి బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ డెసిగ్నేషన్ వెంటనే రద్దు చేస్తూ పరిశ్రమలలో గౌరవప్రదమైన తోటి కార్మికులతో ఉండేలా జనరల్ అసిస్టెంట్‌గా మారుస్తు ఒప్పందం జరిగిందని, అయితే అమలుపై జాప్యం చేస్తున్న కోల్ ఇండియా యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడి అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
స్పందించిన కోల్ ఇండియా యాజమాన్యం ప్రతినిధులు అమలుకు ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తామని ఫిబ్రవరి 6 తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ కార్మికులు సంస్థ పుట్టిన నుండి ఇప్పటివరకు స్పందించని కార్మిక సంఘాల వైఖరిని గమనించాలని విజ్ఞప్తి చేసినారు. సింగరేణి వ్యాప్తంగా సంస్థపరంగా సోషల్ స్టేటస్ పెంచుతు గౌరవప్రదమైన డిజిగ్నేషన్ చారిత్రాత్మకమైన మార్పు, ఒప్పందం అని, గనులలో బదిలీ వర్కర్,జనరల్ మజ్దూర్ కార్మికులు సంబరాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేసినారు.