ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
- ట్రాఫిక్ ఎస్సై నరేష్]

కొత్తగూడెం: కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో వినుత్తన కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు.లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని వాహనదారులకు రవాణా శాఖ అధికారులతో సమన్వయంతో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు లైసెన్సులు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, డిఎస్పీ రెహమాన్ సూచనలతో సోమవారం నుండి ఈ కార్యక్రమం చేపడుతున్నాము అన్నారు. లైసెన్సులు లేకుండా ఆటోలను నడుపుతున్న రామవరం, సూపర్ బజార్, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ అడ్డాలకు చెందిన ఐదుగురు డ్రైవర్లకు జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ సహకారంతో లెర్నింగ్ లైసెన్స్‌లను ఇప్పించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ తెలియజేశారు. డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి అర్హత కలిగి ఉండి లైసెన్సులు తీసుకోకుండా వాహనాలు నడిపే వాహనదారుల కోసం ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు.