దేశమంటే అంబాని,అదానీలేనా ?
- కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బడ్జెట్
- తప్ప కస్ట జీవులకు ఒరిగిందేమీలేదు
- డాక్టర్ డి పాపారావు

కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం దృష్టిలో దేశమంటే అంబాని, అదానీలే తప్ప,సామాన్య ప్రజలు కాదని, కంద్ర ప్రభుత్వం తరఫున ఎనిమిదవ సారి పార్లమెంట్‌లో పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేదిగా ఉన్నదని, కష్టజీవులకు ఏమాత్రం ఉపయోగ పడనిదిగా ఉన్నదని ఆర్థిక రంగా విశ్లేషకులు డాక్టర్ డి పాపారావు అన్నారు.కొత్తగూడెంలో సిఐటియూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆద్వర్యంలో మచికంటి భవన్‌లో సిఐటియూ జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన పాపారావు మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురుజాడ గారు సూక్తి ని ఉటంకిస్తూ మాట్లాడారని,కానీ సమాజ సంపదలో సృష్టికర్తలుగా ఉన్న కార్మికులు, వ్యవసాయ కూలీల,రైతాంగానికి ఊరట ఇచ్చే విధంగా కానీ,కొత్త పథకాలు ప్రకటన కానీ,వారి కొనుగోలు శక్తి పెంచే నిర్ణయాలు కానీ ఈ బడ్జెట్ లో లేవన్నారు.
పైగా అనేక రూపాలలో పరోక్ష పన్నులను భారీగా విధించారని అన్నారు.భారత దేశంలో నూతన ఆర్థిక విధానాల అమలు ప్రారంభమైన 1991నుండి వచ్చిన వరస బడ్జెట్ లను పరిశీలిస్తే కార్పొరేట్ లకు ఊడిగం చేస్తూ,సామాన్యులపైన,మధ్య తరగతి వర్గాలపైన భారాలను మోపే బడ్జెట్ లను తీసుకు వచ్చారన్నారు. రాను రాను క్రమక్రమంగా సామాజిక తరగతులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నారని,ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను,సహజ వనరులను దీ మానిటైజేశన్ పథకం ద్వారా వందల సంవత్సరాలు కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేసే నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయన్నారు.గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే సంపదని నగరాలకు తరలిస్తున్నారని, పట్టణాల్లో ప్రజలకు ఇచ్చే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రవేట్ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం ఈ బడ్జెట్‌లో ఉన్నాడని అన్నారు. ప్రపంచ బ్యాంక్,అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల మార్గ దర్శకత్వంలో విధానాలు పాలకులు రూపకల్పన చేస్తున్నారని,ఈ విధానాలు కాకులని కొట్టి గద్దలకు వేసే విధంగా ఉన్నాయని అన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంకి బడ్జెట్‌లో కేటాయింపులు గత బడ్జెట్‌తో పోలిస్తే తొమ్మిది వేల కోట్లు తగ్గించారని అన్నారు. మధ్య తరగతి వర్గాలకి ఆదాయ పన్ను పరిమితిని ఏడున్నర లక్షల నుండి 12 లక్షలకు పెంచారని, ఇది చూడటానికి పెంపుదలగా ఉన్నప్పటికీ ఈ సంవత్సర కాలంలో పెరిగిన ధరలతో పోల్చితే ఏమాత్రం పెరుగుదల కాదని అన్నారు. కార్పొరేట్‌లకు సంపద పన్ను విధించాలని డిమాండ్ చేశారు. రైతాంగం పండిరచిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని అనేక ఆందోళనలు జరుగుతున్నా ఈ బడ్జెట్బెమాత్రం పట్టించుకోలేదని,పైగా మూడు నల్ల వ్యవసాయ చట్టాల్ని దొడ్డి దోవన అమలు చేయడానికి ఈ బడ్జెట్ మార్గం వేసిందని అన్నారు.

కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ఏప్రిల్ నుండి అమలుకు పూనుకున్నారని అన్నారు. పక్క కార్మిక వర్గం తమకు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని,సామాజిక భద్రత చట్టాలను అమలు చేయాలని పెద్ద ఎత్తున సమ్మెలు,పోరాటాలు చేస్తుంటే పరిగణన లోనికి తీసుకోలేదని అన్నారు.ధరల స్థిరీకరణ కి ఎటువంటి ప్రతిపాదనలు లేవన్నారు.ప్రజా వ్యతిరేఖ నిర్ణయాల అమలుకు ఈ బడ్జెట్ ఉతమిస్తున్నదని,బడ్జెట్‌లో సవరణలు చేసి తగిన విధంగా కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పాపారావు అన్నారు.ఇటువంటి విధానాలు అమలు చేసిన పాలకులను శ్రీలంక లో గత సంవత్సరం చివరిలో జరిగిన అధ్యక్ష,పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిరచి ప్రజల తరఫున పోరాడుతున్న కమ్యూనిస్టులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు.
మన దేశంలో కూడా ఇటువంటి పరిణామాలు జరగడానికి ఎంతోకాలం పట్టదని,ఈ విధానాలుకు వ్యతిరేఖంగా ప్రజలంతా ఐక్యమై ఉద్యమాలు చేస్తే అటువంటి రోజు వస్తున్నాదన్నారు.ఈ సదస్సు లో సిఐటియూ,వ్యవసాయ కార్మిక సంఘం,రౖౖెతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎ.జె.రమేష్,అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్,మచ్చా వెంకటేశ్వర్లు,అన్నవరపు కనకయ్య,యలమంచిలి వంశి కృష్ణ, కొక్కెరపాటి పుల్లయ్య, కున్సోత్ ధర్నా,దొడ్డ రవి కుమార్,కె.సత్య,ముదిగొండ రాంబాబు, ఉకంటి రవి,యస్. ఏ.నబీ,ఆలేటి కిరణ్,శెట్టి వినోద తదితరులు పాల్గొన్నారు