నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు

  • వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలి
  • జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కొత్తగూడెం : ఆశ్రమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు.  పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డైనింగ్‌ హాల్‌, తరగతి గదులు, పరిసరాలు, మరుగుదొడ్లు, వంటగది పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కలెక్టర్‌ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మెనూ ప్రకారం అందిస్తున్నారా అడిగి తెలసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ డార్మెటరీ డోర్లు, కిటికీలు, త్రాగునీటి సమస్యలు, ఎలక్ట్రికల్‌ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళికల అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. డార్మెటరీ హాల్లో దోమలు రాకుండా జాలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రహరీ గోడ పై కంచ ఏర్పాటు చేయాలని దానికి అవసరమైన నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత లేని పదార్థాలను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పాఠశాలలు వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు. నాణ్యమైన విద్య, మెనూ సక్రమంగా అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం అందరి బాధ్యత అని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ పర్సనల్‌ లో కలెక్టర్‌ వెంట డిడి ట్రైబల్‌ వెల్ఫేర్‌ మణెమ్మ, పాఠశాల హెడ్మాస్టర్‌ బద్రు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading