గ్రామ పంచాయితీ కార్మికుల పొట్ట కొడితే ఊరుకోం
- ఆరవ రోజు చేరిన కార్మికుల సమ్మె
- సంపూర్ణ మద్దతు తెలిపిన సీఐటీయూ
- జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్

కొత్తగూడెం : పాలకవర్గం లేదనే నెపంతో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలలో కోత విధిస్తూ తప్పుడు నిర్ణయాలతో కార్మిక కుటుంబాలు అర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరుకున్న సందర్భంగా సిఐటియూ కార్మికుల సమ్మెకు సంపూర్థ మద్దతు తెలిపింది. ఈసందర్భంగా కార్మికులను ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ కార్మికుల వేతన సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సరైన వేతనాలు అందేవరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు.
స్థానిక శాసన సభ్యులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దాం అన్ని అన్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. చాలి చాలని వేతనాలు అమలు చేస్త ప్రతిఘటన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ, కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ప్రతి నెల రూ12,500 ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారని, రోజంతా కష్ట పడి పనిచేస్తూ, గ్రామాలన్నీ శుభ్రతగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్న కార్మికులకు చాలి చాలని వేతనాలు సరిపోక జీవితాలను వెళ్లదీస్తున్న వారికి అధికారులు అండగా నిలవకుండా గత నెల నుండి పాలకవర్గం లేదనే తప్పుడు నిర్ణయాలతో జీతాలు తగ్గిస్తూ రూ 9500 ఇస్తామని చెప్పడం కార్మికుల పొట్ట కొట్టడమే అవుతుందని విమర్శించారు.
ఇలా అధికారులు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, తప్పుడు నిర్ణయాలతో కార్మికుల బతుకులు ఆగం చేస్తే ప్రతిఘటన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఆరు పంచాయితీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సమస్య పరిష్కారం అయ్యేవరకు కొనసాగించే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఆదర్శంగా నిలబడాలని కోరారు.శిబిరాన్ని సందర్శించి, సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో సీఐటీయూ భూక్యా రమేష్ ఉన్నారు.