బ్యాంక్ ఆఫ్ బరోడా పాఠశాలకు ఫ్రిజ్ వితరణ
- విద్యార్థులకు స్టేషనరీ ఇచ్చిన మేనేజర్

కొత్తగూడెం : భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మౌళిక వసతుల కల్పనలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు నిలుస్తుందని మేనేజర్ కృష్ణకాంత్, అసిస్టెంట్ మేనేజర్ మాలోతు అరుణ అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం గరీబుపేట పంచాయితీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగునీటి సౌకర్యార్థం, వేడి, చన్నీటి ఫ్రిజ్‌ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ దత్తత గ్రామం గరీబ్ పేటలో ఈ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతులను సమకూర్చేందుకు తమ బ్యాంక్ సిద్దంగా ఉంటుందన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు అవసరం దృష్టిలో ఉంచుకొని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చెప్పడతామన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ సునీల్, రిషి, సిబ్బంది నునావత్ లీల ప్రధానోపాధ్యాయురాలు, మాజీ సర్పంచ్ మాలోత్ రాములు, స్థానికులు,నర్సింగ్ బిక్షం,గంగుల తిరుపతి యాదవ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.