కొవ్వూరు రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలి
- సెంటర్ రైల్వే డిఆర్‌యూసిసి మెంబం శ్రీనివాస్ రెడ్డి

కొత్తగూడెం : కేంద్ర బడ్జెట్‌లో కొత్తగూడెం నుండి కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు.కరోనా లో రద్దు అయిన రైళ్ళను, కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ ను తిరిగి తక్షణం పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కొత్తగూడెం కేంద్రంగా నిర్మించే కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి అధిక నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన తక్షణమే నిర్మాణం పూర్తి చేసి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌కు మెయిల్స్ ద్వారా వినతి పత్రాలను పంపించారు.
కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెం నుండి డోర్నకల్ వరకు డబుల్ ట్రాక్ నిర్మాణ పనులను తక్షణం పూర్తి చేయాలని, అమృత్ భారత్ నిధుల ద్వారా నిర్మిస్తున్న రైల్వేస్టేషన్లఆధునీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శిరిడీకి కొత్తగూడెం నుండి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని భద్రాచలం రామాలయానికి భక్తుల సౌకర్యార్థం రైల్వే లైన్ తో పాటు ప్రత్యేక రైలును నడపాలని శ్రీనివాస్ రెడ్డి కేంద్ర మంత్రులకు సెంట్రల్ రైల్వే అధికారులకు కోరినట్లు ప్రకటనలో తెలిపారు.