ఈపి ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
- హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో డ్కెరెక్టర్ (పా)కు వినతిపత్రం

సింగరేణి : సింగరేని సంస్థలో పనిచేస్తున్న ఈపి ఆపరేటర్ల టెస్టుల సాకుతో కార్మికుల ప్రమోషన్ అడ్డుకోడం సరికాదని, అర్హులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని హెచ్‌ఎంఎస్ ఏరియా వైస్ ప్రసిడెంట్ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈపి ఆపరేటర్లకు నిబంధనల ప్రకారం నామ మాత్రపు టెస్టులతో ప్రమోషన్లు కల్పించాలని హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో సింరగేణి ప్రధాన కార్యాలయంలో డ్కెరెక్టర్ పా వెంకటేశ్వర రెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్ ఎస్కులేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు నిర్వహిస్తూ ఈపి ఆపరేటర్ల పదోన్నతులను అధికారులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గ్రేడ్ ప్రమోషన్‌లను సాధారణ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి రెండు ఏళ్ళకు ఒక సారి జరిగే పదోన్నతులను గతంలో నిర్వహించినట్లుగా కొనసాగించాలని కోరారు. ప్రమోషన్ రాకుండా ఫెయిల్ చేయడంతో మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో సింహ భాగాన నిలుస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈపి ఆపరేటర్లపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. బెస్ట్ ఎంప్లాయిస్ ఆవార్డులు పొందిన ఈపి ఆపరేటర్లను సైతం టెస్టుల పేరుతో అనర్హులుగా ప్రకటించడం వెన ఆంతర్యం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ప్రమోషన్‌లలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈపి ఆపరేటర్లకు న్యాయం జరిగేవరకు వారి పక్షాన హెచ్‌ఎంఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. సమస్య పై స్పందించిన డ్కెరెక్టర్ పా ఈ విషయాన్ని చర్చించి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు బ్రాండ్ సెక్రెటరీ ఆసిఫ్ ఏపీ ఆపరేటర్లు సెంట్రల్ వైస్ ప్రసిడెంట్ చిత్తారపు సారయ్య, ఇక్‌బాల్, నాజర్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.