పోలీసుల ఎదుట ఐదుగురు మోవోల లొంబాటు

  • జీవనోపాధి,పునరావాసం కల్పిస్తాం
  • జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు

కొత్తగూడెం : నిషేదిత సీపిఐ మావోయిస్ట్‌ పార్టీకి చెందిన నలుగురు ఏరియా కమిటీ సభ్యులు, దళసభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81, 141 బెటాలియన్‌ సిఆర్పిఎఫ్‌ అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి వివరాలు వెల్లడిరచారు. ఛత్తీస్ఘడ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పెద్దగెల్లూరు గ్రామానికి చెందిన పూనెం పాక్లి (27), ఇర్రపల్లి గ్రామవాసి రవ్వ సోమ (25), పామేడ్‌కు చెందిన మడివి గంగి(23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రంపాడు గ్రామానికి చెందిన నెట్టి దేవ అలియాస్‌ బాలు( 21), చెన్నాపురం గ్రామానికి చెందిన చర్ల ప్లాటూన్‌ దళకమిటీ సభ్యుడు మడకం ఉంగి అలియాస్‌ గంగి (22) పోలీసుల ఎదుట లొంగిపోయారని, వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ఎస్పి స్పష్టం చేశారు. ఎస్పి మాట్లాడుతూ పూనెం పాక్లి 2016 సంవత్సరంలో సిఎన్‌ఎం సభ్యురాలిగా మావోయిస్ట్‌ పార్టీలో చేరి, 2018 సంవత్సరంలో ధళ సభ్యురాలిగా అనంతరం 2022లో బాసగూడ ఎల్‌వోఎస్‌ ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందిందని తెలిపారు. అగ్రనాయకుల ఆదేశాల మేరకు పలు విధ్వంసకర ఘటనలలో పాల్గొందన్నారు. పూనెం పాక్లి, వెట్టి దేవ అలియాస్‌ బాలు, మడకం ఉంగి అలియాస్‌ గంగి, రవ్వ సోమల పై రూ 4లక్షల రివార్డు ఉందన్నారు.

వెట్టి దేవ అలియాస్‌ బాలు 2018లో మావోయిస్ట్‌ పార్టీలో సభ్యుడిగా చేరాడని అన్నారు. 2019 నుండి 2022 వరకు చర్ల ఎల్‌వోఎస్‌లో మిలిషియా సభ్యుడిగా పని చేస్తూ పార్టీ నాయకుల ఆదేశాలతో భద్రతా బలగాలపై ఎన్నో దాడులకు పాల్పడినట్లు వెల్లడిరచారు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది అగ్ర నాయకుల ఆదేశాల మేరకు 2022 ఆగస్ట్‌లో కుర్నపల్లిలో ఇర్ప రాముడును హత్యచేసిన ఘటనలో, 2023 ఫిబ్రవరిలో కుంజర్‌ అంబుష్‌ (సిజి) దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో నిందితుడని, 2024 ఆగస్ట్‌లో చెన్నాపురంలో నీలో రాధా ను హత్యచేసిన ఘటనల్లో కీలకంగా వ్యవహరించాడని గుర్తు చేశారు. మడకం ఉంగి అలియాస్‌ గంగి 2018 సంవత్సరంలో సిజి సభ్యురాలిగా మావోయిస్ట్‌ పార్టీలో చేరి, 2019లో చర్ల ఎల్‌వోఎస్‌కు బదిలీ అయ్యిందన్నారు. 2021లో టేకులగూర్శ(సిజి)లో మావోయిస్ట్‌ దాడిలో 24 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనలో కీలకంగా వ్యవహరించిందన్నారు. అనంతరం 2024లో చర్ల ఎల్‌వోఎస్‌ ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందిదని, 2024 జనవరిలో ధర్మారం, చింతనాగు సిఆర్‌పిఎస్‌ క్యాంప్‌లపై దాడి ఘటనలలో పాల్గొన్నదని, ప్రస్తుతం పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయిందన్నారు. రవ్వ సోమ 2010లో బాలల సంఘంలో సభ్యుడిగా పార్టీలో చేరి, అనంతరం 2017నుండి 2021 వరకు ధళ సభ్యుడిగా పామేడ్‌ ఏరియా, సౌత్‌ బస్తర్‌ డివిసిలో పనిచేసి చత్తీస్ఘడ్లో అనేక విధ్వంసకర ఘటనలలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అనంతరం 2023లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది పామేడ్‌ ఏరియా ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.

గంగి 2018లో బాలల్‌ సంఘంలో చేరి 2019లో ఎర్రపల్లి ఆర్‌పిసిలో మిలిషియా సభ్యురాలిగా అనంతరం పామేడ్‌ ఎల్‌వోసిలో ధళ సభ్యురాలిగా భద్రతా బలగాలపై ఎన్నో దాడులలో పాల్గొన్నా ఈమెపై రూ లక్ష రివార్డ్‌ ఉందన్నారు. గత కొంతకాలంగా లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరపున జిల్లా పోలీసులు కల్పిస్తున్న సహకారాన్ని  అందిస్తున్న తీరుతో జనజీవన స్రవంతిలో కలిసి మెరుగైన జీవితం గడపాలని నిశ్చయించారని తెలిపారు.  తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమపై చూపుతున్న వివక్షను గ్రహించి పూనెం పాక్షి, వెట్టి దేవ, మడకం ఉంగి, రవ్వ సోమ, మడివి గంగి మావోయిస్ట్‌ పార్టీని వీడి శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారని అన్నారు లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా, తమ దగ్గరలోని పోలీస్‌ స్టేషన్లో, జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే దళసభ్యులకు జీవనోపాధి,పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు హామీ ఇచ్చారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading