కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
- రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్
కొత్తగూడెం : కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో పర్యటించారు. ఈసందర్భంగా అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు చాలా ఏళ్లుగా పెరగలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించడమే ఐఎన్‌టియూసి ప్రధాన కర్తవ్యం అన్నారు.
అతి త్వరలో కనీస వేతనాల పెంపు కోసం ప్రభుత్వంతో మాట్లాడి వేతనాలు పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 2023 డిసెంబర్ 18న నూతనంగా 176 జూనియర్ అసిస్టెంట్లు విధుల్లో చేరిన ఉద్యోగుల ఎదుర్కొంటున్న సిల్స్ సమస్యను పరిష్కారానికి కృషి చేసిన ఆయనకు ఐఎన్‌టియూసి నాయకులు కలసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, శ్రీనివాస్, అశోక్, రాజేశ్వర్ రావు, యూసఫ్ పాల్గొన్నారు.