ఘనంగా వాజ్పేయి శత జయంతి

కొత్తగూడెం : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని జిల్లా అధ్యక్షుడు కెవి రంగా కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో వాజ్పేయి జయంతి పురస్కరించుకొని రంగాకిరణ్ మాట్లాడతూ డిసెంబర్ 25న యావత్ దేశం సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు.భారతదేశ ఖ్యాతిని ప్రపంచాలకు వెలుగు చూపిన వ్యక్తి దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహా మేధావి,కార్య దక్షుడు,అనేక రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కొదవ సింహం పాండురంగాచార్యులు, జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు గుమలాపురం సత్యనారాయణ, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సాయి కిరణ్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.