శబ్బాష్ దొప్పలపూడి !
- గుంతలు పూడ్చిన ఘనుడు
పాల్వంచ : సమాజ హితమే తన మతంగా భావించే పాల్వంచకు చెందిన దొప్పలపూడి సురేష్ మిత్రులతో కలిసి చేసిన పనిని మానవన్తం ఉన్నవారెవ్వరూ మెచ్చుకోక ఉండలేరు. పాల్వంచ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోని రోడ్ గుంతల పడి అద్వాన్నంగా తయారైంది. అటుగా వెళ్లే వాహనదారులు, ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. అధికారులు సైతం ఎవ్వరూ పట్టించుకో పోవడంతో గత కొంత కాలంగా అ మార్గం గుండా ప్రయాణించాలి అంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంతల రోడ్లతో వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. దీనికి తోడుగా వయోభారంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయం గమనించి దొప్పలపూడి సురేష్ తన మిత్రులతో కలిసి స్వయంగా వెట్ మిక్స్‌తో గుంతలు పూడ్చే కార్యక్రం చేపట్టారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ను షబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా కోట్ల రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి తెచ్చి పెడుతున్న పాల్వంచ మున్సిపాలిటీ అధికారులకు సైతం పట్టడం లేదని ప్రజల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.