సొసైటీ ఎన్నికల్లో టిబిజికెఎస్ విజయం
- సొసైటీ డైరెక్టర్‌గా వేముల శైలేష్ కిరణ్
- విజేతను అభినందించిన ఎంపీ వద్దిరాజు

కొత్తగూడెం : సింగరేణికి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సెంట్రల్ వర్క్ షాప్ సొసైటీ ఎన్నికల్లో టిబిజికెఎస్ విజయకేతం ఎగురవేసింది. సెంట్రల్ వర్క్ షాప్ ఉద్యోగుల సహకార పొదుపు సంఘం ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో టిబిజికెఎస్ అభ్యర్థిగా వేముల శైలేష్ కిరణ్ పోటీలో నిలిచారు. అందరి అంచనాలకు మించి ఎన్నికల్లో టిబిజికెఎస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. వర్క్ షాప్ క్రెడిట్ సొసైటీ డ్కెరెక్టర్‌గా గెలిచి గులాబీ జెండాను రెపరెపలాడిరచిన శైలేష్ కిరణ్‌ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సొసైటీ ద్వారా ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీ రవిచంద్ర కోరారు.