గ్రూప్‌-2 పరీక్షలకు పటిష్ట భద్రత

  • డిఎస్పి అబ్దుల్‌ రహమాన్‌

కొత్తగూడెం : నేడు జరుగనున్న గ్రూప్‌-2 పరీక్షలకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డిఎస్పి ఎస్‌కె అబ్దుల్‌ రహమాన్‌ పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు శనివారం కొత్తగూడెం పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పరిక్షా కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి అన్నారు. పరీక్షలు జరుగుతున్నంత సేపు కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సమీపంలోని అన్ని దుకాణాలు, ఇంటర్నెట్‌ కేంద్రాలను మూసివేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా హాలులోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అవాంచనీ సంఘటనలకు తావు లేకండా పరీక్షలు సజావుగా జరిగేలా ప్రశాంత వాతావరణం ఉండేలా పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎఆర్‌ డిఎస్పి సత్యనారాయణ, సిఐలు కరుణాకర్‌, శివకుమార్‌, రమేష్‌, సురేష్‌ తదితరులు హాజరయ్యారు

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading