ఎత్తుక పోతుంటే ఏం చేస్తున్నట్లు !

  • దొంగలతో దోస్తి కట్టిందెవరు ?
  •  కోవర్టులుగా ఎస్‌అండ్‌పిసి సిబ్బంది
  • వాస్తవాలు వెల్లడిరచలేని వింత పరిస్థితి

సింగరేణి : సింగరేణి సంస్థ ఆస్థుల పరిరక్షించాల్సిన బాధ్యత ఎస్‌అండ్‌పిసి శాఖపై ఉంటుంది. కానీ కంచే చేను మేసినట్లుగా తయారైంది సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ఎస్‌అండ్‌పిసి పరిస్థితి.ఈ శాఖలో పని చేస్తున్న కొందరు సిబ్బంది తీరు చూస్తుంటే దొంగలతో దోస్తి కట్టారా అన్న అనుమానాలు కలగక మానవు. కొత్తగూడెం ఏరియాలో సంస్థ ఆస్థులు చోరికి గురవుతున్నాయి. ఎస్‌అండ్‌పిసి అధికారులకు, సిబ్బందికి దొంగల సమాచారం చెప్పేందుకు స్థానికులు సంకోచిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాల్సింది పోయి కాసులకు కక్కుర్తి పడి కొందరు సిబ్బంది సమాచారం ఇచ్చే వ్యక్తుల పేర్లను దొంగలకే చేరవేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమాచారం ఇచ్చే వారిపై దొంగలు గొడవకు దిగడం లాంటి సంఘటనలు తరచూ జరుగడం ఇందుకు నిదర్శనం. డిపార్ట్మెంట్‌లోని కొందరు వ్యక్తులు చేస్తున్న పనులతో బాధ్యత గల పౌరులుగా సంస్థ ఆస్తులకు నష్టం వాటిల్లుతుంటే డిపార్ట్మెంట్‌కు సమాచారం ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దొంగల సమాచారం తెలిపే వ్యక్తుల వివరాలు రహస్యంగా ఉంచాల్సింది పోయి బహిర్గతం చేయడంతో జనాలు జంకుతున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు స్థానికులు. సంస్థ ఇచ్చే జీతం తీసుకుంటూ దొంగలకు వంతు పాడుతున్న సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌ పంచాయతీ పరిధిలోని ఎస్‌ఆర్‌టి ఏరియాలో 152క్వార్టర్లు, 62 సొంతగా నిర్మించుకున్న ఇల్లు, వికె ఓసి విస్తరణలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న వీటిని తొలగించారు. అప్పట్లో క్వార్టర్లలో ఉండే కార్మికుల విద్యుత్‌ అవసరాల కోసం ఐరన్‌ పోల్స్‌ను ఏర్పాటు చేసింది సంస్థ. ఇటీవల క్వార్టర్స్‌ను తొలగించిన నేపథంలో విద్యుత్‌ తీగలను తొలగించి విద్యుత్‌ స్తంభాలను అలానే వదిలేశారు. ఈ ప్రాంతంలో జన సచారం, గస్తీ లేకపోడంతో ఇదే అదునుగా భావించి దొంగలు పోల్స్‌ను కట్‌ చేసి ఇనుమును అమ్ముకుంటున్నారు.

ఇప్పటికే సుమారు 20 పోల్స్‌ మాయం అయినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క ఫోల్‌ 11మీటర్ల ఎత్తు, కింటన్నర బరువు అంటుందని, ఖరీదు మార్కెట్‌లో సుమారు రూ 10వేల వరకు ఉంటుందని స్థానికుల అంచన. ఇంత జరుగుతున్న సంస్థ ఆస్తులను కాపాడవలసిన ఎస్‌అండ్‌పిసి సిబ్బంది నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. కార్మికులు చిన్న పొరపాటు చేస్తే చార్జీ షీట్‌ ఇచ్చే అధికారులు, సంస్థకు భారిగా నష్టం జరుగుతుంటే చేష్టలుడికి చూస్తున్నారు తప్ప అధికారుల మీద ఎలాంటి చర్యలు లేకపోడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇంత జరుతున్నా స్పెషల్‌ టీం, ఇంటలిజెన్స్‌ విభాగాలు ఏం చేస్తున్నట్టు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సింగరేణి సంస్థ ఆస్తులను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఎస్‌అండ్‌పిసిలోని స్పెషల్‌ టీంలో ఆరుగురు సభ్యులు, ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఇద్దరు సభ్యులు సంస్థల ఏం జరిగినా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్న చందంగా ఎస్‌అండ్‌పిసి శాఖ తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్తుల రక్షణలో ముఖ్య భూమిక పోషించాల్సింది పోయి పెద్ద మొత్తంలో ఎస్‌ఆర్‌టి ఏరియాలో పైప్‌ లైన్‌లు, ఇనుప విద్యుత్‌ స్తంభాలు ముక్కలుగా కోసి ఎదేశ్చగా అముమ ఏం చేస్తున్నట్టు, ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోరా? కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం ఏమిటని ? స్పెషల్‌ టీం పేరిట ఏం చేస్తున్నాట్లు ? సంస్థ ఆస్తులను కాపాడేది ఎవరు? అనే ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బాధ్యత రాహిత్యంగా పనిచేస్తున్న సిబ్బంది పై చర్యలు చేపట్టి నిరుపయోగంగా ఉన్న స్తంబాలను ఎలక్ట్రికల్‌ డిపార్ట్మెంట్‌ స్వాధీనం చేసుకొని సద్వినియోగం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading