సెక్యూరిటీ సూపర్వైజర్ విధుల నుండి తొలగించాలి
- సిఅండ్‌ఎండి పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

కొత్తగూడెం : సింగరేణి సిఅండ్‌ఎండి ఎన్ బలరాం నాయక్ పై సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకరి శ్రీనివాస్‌ను విధుల నుండి తొలగించాలని ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సంఘాలు డిమాండ్ చుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం శాలెం రాజును కలిసి ప్రైవేటు సెక్యూరిటీ సూపర్వైజర్‌గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ చాలా ఏళ్ళుగా అక్కడ పని చేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గాడ్స్ పై కుల వివక్ష చూపుతూ నేను చెప్పింది వేదం నేను చేసింది శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఆయన వ్యవహార శైలిపై పలుమార్లు సింగరేణి అధికారులకు అనేక మార్లు కుల సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అతనికి ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా తనపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం మందుకు రాలేదు. ఇదే అదునుగా చూసుకొని తన స్థాయిని మరిచి ఏకంగా గిరిజన సింగరేణి సిఅండ్‌ఎండి ఎన్ బలరాం నాయక్ పై సోషల్ మీడియాలో సిఅండ్‌ఎండిని తొలగించి వేర వారిని నియమిస్తున్నట్లు అసత్యప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. నిమ్మవర్గానికి చెందిన వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉంటే అక్కసుతో ఇలా సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ వేదికగా గిరిజన సిఅండ్‌ఎండిని కించపరుస్తూ పోస్టులు పెట్టారని మండి పడ్డారు. ఈ నేపధ్యంలోనే జిల్లాలోని ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సంఘాలు బాధ్యత గల హోదాలో ఉండి ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్న శ్రీనివాసును విధుల నుండి తొలగించాలని జిఎంకు వినతిపత్రం అందజేశారు. లేనిపక్షంలో అతనిపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదయ్యకు జిల్లా ఎస్పిని ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్సి, ఎస్టి అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఆంతోటి నాగేశ్వరరావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, ఎమ్మార్పీఎస్ నాయకు కలకోటి ఐలయ్య, రాసపల్లి రాజేంద్రప్రసాద్, మాజీ రుద్రంపూర్ సర్పంచ్ గుమ్మడి, సాగర్, మైనార్టీ నాయకులు ఎండి యూసుఫ్ బిసి సంఘం నాయకులు పెచ్చుట శ్రీకాంత్ తదితర ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.