హోంగార్డ్ ఆఫీసర్స్ పనితీరు భేష్
- నిబద్దత, అంకిత భావంతోనే గుర్తింపు
- ఎస్పి రోహిత్ రాజు

కొత్తగూడెం : పోలీస్ శాఖలో హోంగార్డు ఆఫీసర్స్ పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పి రోహిత్ రాజు అన్నారు. ఐఎంఎ ఫంక్షన్ హాలులో హోంగార్డుల 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఎ హాలులో ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సి హాజరై మాట్లాడారు.
జిల్లా పోలీస్ శాఖలో నిరంతరం పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. ప్రకృతి విపత్తులు, ఎన్నికల సమయాల్లో, రోజువారీ విధులలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంలోను, బాధ్యతయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన భాధ్యతలను నిబద్ధతతో నిర్వహించారని ప్రశంశించారు.
నిత్యం క్రమ శిక్షణతో పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. హోంగార్డ్స్ ఆఫీసర్స్ సంక్షేమానికి అన్ని వేళలా ముందుంటామని తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులను సమర్థవంతంగా చేపట్టాలని కోరారు. త్వరలో పదవి విరమణ చెందుతున్న తొమ్మి మంది హోంగార్డ్స్ ఆఫీసర్స్కు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు.

విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురికి ప్రశంస పత్రాలను అందజేశారు. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వారితో కలిసి ఎస్పి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఎస్పి రోహిత్ రాజు శాంతి కపోతాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, డిఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,సీఐలు సంజీవ్ కుమార్, కరుణాకర్, రమేష్, శివప్రసాద్, సురేష్, టి కరుణాకర్, ఇంద్రాసేనారెడ్డి, ఆర్‌ఐలు హోమ్ గార్డ్స్ ఇంచార్జి ఆర్‌ఐ నరసింహారావు, అడ్మిన్ ఆర్‌ఐ లాల్ బాబు, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్‌ఐ కృష్ణారావు, ఆపరేషన్స్ ఆర్‌ఐ రవి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.