రాసూరికి  కార్మిక రత్న జాతీయ అవార్డు

  • ప్రకటించిన బహుజన సాహిత్య అకాడమీ

సింగరేణి /కొత్తగూడెం : కార్మిక హక్కుల పరిరక్షణకు అహర్నిషలు శ్రమిస్తున్న కార్మిక పక్షపాతి రాసూరి శంకర్‌కు బహుజన సాహిత్య అకాడమీ (బిఎస్‌ఎ) వారు అత్యంత ప్రతిష్టాత్మక కార్మిక రత్న జాతీయ అవార్డును ప్రకటించారు. కొత్తగూడెంకు చెందిన సింగరేణి కార్మికులు ఆల్‌ ఇండియా ఎస్సి, ఎస్టి రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ సింగరేణి బ్రాంచ్‌ అధ్యక్షులు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం నాయకుడు రాసూరికి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నాచారంలోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో బిఎస్‌ఎ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఈ అవార్డును ప్రకటిస్తూ ఆహ్వాన పత్రాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో శంకర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్పి, ఎస్టి, బిసి, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవలకు, సామాజిక కార్యకర్తలకు, రచయితలకు, కవులకు, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 15న దేశ రాజధాని న్యూఢల్లీిలో జరిగే బహుజన సాహిత్య అకాడమీ ఐదవ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా కార్మిక రత్న జాతీయ అవార్డును శంకర్‌కి అందజేయునట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌కు దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతాని రాధాకృష్ణ తెలిపారు. అనంతరం రాసూరి శంకర్‌ మాట్లాడుతూ బహుజన సాహిత్య అకాడమీ వారు తను కార్మిక వర్గానికి చేస్తున్న నిస్వార్ధ సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మక కార్మిక రత్న జాతీయ అవార్డును ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్మిక రత్న జాతీయ అవార్డు తనలో ఆత్మస్థైర్యాన్ని, బాధ్యతలను మరింత పెంచిందని ఈ ప్రోత్సాహంతో సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు, ఓబి వర్కర్లకు మరింత చేరువయ్యే విధంగా తన సేవలను మరింత విస్తృతపరిచే విధంగా వారి హక్కుల సాధనకై తన టీం ఎల్లవేళలా సింగరేణి కార్మికులకు కాంట్రాక్టు కార్మికులకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.

అవార్డును తన అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. రాసూరి శంకర్‌కి కార్మిక రత్న జాతీయ అవార్డు ప్రకటించడం పట్ల గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజిక కార్యకర్త సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత ఎస్‌డి నాసర్‌ పాషా మాట్లాడుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కొరకు నిస్వార్ధంగా ఓబి వర్కర్లకు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎనలేని సేవలు చేస్తున్న శంకర్‌ కు బహుజన సాహిత్య అకాడమీ వారు గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ కార్మిక రత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఫోన్లో శంకర్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.శంకర్‌కు ఈ అవార్డు అందజేసిన వారిలో బీఎస్‌ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ గారితో పాటు తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్‌, రాష్ట్ర కోఆర్డినేటర్‌ హనుమాండ్ల విష్ణు మరియు అవార్డు సెలక్షన్‌ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నల్లా జ్యోతి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading