గుడివాడ రామ లక్ష్మణ్ మృతి తీరని లోటు
- బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవేందర్

కొత్తగూడెం : ప్రజల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తెచ్చేందుకు గుడివాడ రామ లక్ష్మణ్ తన తుది శ్వాస వరకు ప్రయత్నించారని, ఆయన లేని లోటు సమాజానికి తీరని లోటని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు గుడివాడ రామ్ లక్ష్మణ్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకుని రామాటాకిస్ వద్ద వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరమర్శించారు.
ఈ సందర్భంగా రాఘవేందర్‌రావు మాట్లాడుతూ నిజాయితీ, నిబద్దతకు నిదర్శనంగా రామ లక్ష్మణ్ బ్రతికారని, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆదర్శంగా ప్రతికారని, విలువలతోకూడిన రాజకాయాలు అయన సొంతం అన్నారు. కొనియాడారు. అనంతరం కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు గుండె ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల ప్రసాద్, అంబుల వేణు, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తలుగు అశోక్, పిల్లి కుమార్, బొందుగల శ్రీధర్, బొమ్మిడి రమాకాంత్, నరేందర్, హైమత్ తదితరులు పాల్గొన్నారు