ప్రకృతి ఆశ్రమం సామాజిక సేవలకు నిలయం
-
ఆశ్రమంలో శాకాహార దినోత్సవం
-
మన్ కి బాత్ దంపతులకు ఘనసన్మానం

కొత్తగూడెం : జయరాజు నేతృత్వంలో నడుస్తున్న ప్రకృతి ఆశ్రమం సామాజిక సేవలకు నిలయంగా మారడం హర్షనీయం అని అన్నారు.
సింగరేణి సాహితీ, సాంస్కృతిక, సమాఖ్య యోగాకేంద్ర ఆశ్రమం ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేందుకు దోహదపడుతుంది అన్నారు. ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా ప్రకృతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొనిమాట్లాడారు. ఇటీవల దేశ ప్రధాని మన్ కి బాత్‌లో స్థానిక సింగరేణి కార్మికుడు మొక్కల రాజశేఖర్ పేరు చోటు చేసుకోవడం పై ఆయనని అందరూ అభినందించారు.
సీనియర్ సిటిజన్స్ డే ప్రాముఖ్యతలను వివరించారు. ప్రకృతి ఆశ్రమం ద్వారా ప్రకృతి వైద్యం, మొక్కల పెంపకం, ఉచిత పంపకం, యోగా శిక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్మశాన వాటికలలో మొక్కలు దత్తత తీసుకోవడం లాంటి సామాజిక, పర్యావరణ, సేవ కార్యక్రమాల తో పాటు, కరోనాకాలంలో వేలాది మంది ఆరోగ్యాలను కాపాడిన ఘనత ఆశ్రమానికి ఉందన్నారు.
ఆశ్రమం కోఆర్డినేటర్ సుగుణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మొక్కల రాజశేఖర్,కల్పన దంపతులను ఘనంగా సన్మానించారు. ఆశ్రమ సీనియర్ సిటిజన్స్ డాక్టర్ బత్తుల కృష్ణయ్య, పిల్లలమర్రివరప్రసాద్ (పిచ్చయ్య), గొర్రె మల్లయ్య లను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఆశ్రమం గౌరవాధ్యక్షులు డా బత్తుల కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలను సైతం కేక్ కట్ చేసి, ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జె బాలశౌరి, పీసీసీ సభ్యులు నాగ సీతారాములు, సింగరేణి లైసన్ ఆఫీసర్ కలవాల చంద్రశేఖర్, డా.కృష్ణ, డా ప్రసన్న కుమార్, డా చిన్నప్పయ్య, అబ్రహం, ఆశ్రమ అధ్యక్షులు కె.హెచ్. ప్రసాద్, బుద్ధిస్టు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కొచ్చర్ల కమలారాని, మారపాక రమేష్, మల్లెల రామనాథం, మహమ్మద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.