ఈడి దాడులతో భయ పెట్టలేరు

  • ప్రజాధరణ జీర్ణించుకోలేక  బిజెపి కుట్ర

కొత్తగూడెం : మానసికంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులను దెబ్బతీసే కుట్రలో భాగమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ పై బిజెపి ఈడీ దాడులు చేయిస్తుంది జెడ్పి చైర్మన్‌ కంచర్ల విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడి దాడులను పూర్తిగా ఖండిస్తూ చుంచుపల్లి మండలంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూన కాంగ్రెస్‌ ప్రభుత్వ 9 నెలల పాలనను జీర్ణించుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈడి దాడులు చేపిస్తుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరుగన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజిపి ఆహ్వానాన్ని తిరస్కరించిందనే అక్కసుతో పంగులేటి పై బిజిపి కక్షసాధింపు రాజకీయాలు చేస్తుందన్నారు. పొంగులేటి వల్లే రాష్ట్రంలో బిజెపి బీటీమ్‌ బిఆర్‌ఎస్‌ చిత్తుగా ఓడిపోయింది గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను రాజకీయంగా ఎదుర్కొనలేక బిజెపి, బిఆర్‌ ఎస్‌ రెండు కూడబలుక్కుని ఈ దుశ్చర్యలకు పాలదాడుతున్నాయని అన్నారు. రాజకీయ లబ్ది కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటి కడిగిన ముత్యం అని, ప్రజా సంక్షేమానికి పరితపించే ప్రజా నాయకుడు పొంగులేటి అన్నారు. ఆదిశగా అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడిని ఈడీ దాడులు భయపెట్ట లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నాగేంద్ర త్రివేది, మేరెడ్డి జనార్దన్‌ రెడ్డి, మండే వీర హనుమంతరావు, తోట దేవి ప్రసన్న, పీతాంబరం,చీకటి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading