డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి
- మాదకద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
- సిఐ కరుణాకర్
కొత్తగూడెం : మాదకద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్ నాశనం అవుతుందని సిఐ కరుణాకర్ అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలై యువత తమ ఉజ్వల భవిషత్‌ను చేజేతులా పాడు చేసుకుంటున్నారు అని చెప్పారు. బుధవారం కొత్తగూడెం పట్టణం వన్ టౌన్ పరిధిలోని ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణలో ఆర్టీసి సిబ్బంది, ఆటోడ్రైవర్లు, ప్రయాణికులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
సిఐ కరుణాకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లా ఎస్సి ఆదేశాల మేరకు, డిఎస్పి సూచనలతో నిషేదిత మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. డోంట్ లెట్ డ్రగ్స్ బ్రేక్ యూ స్టే అవే బీ సేఫ్ నినాదంతో ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడతూ శిక్ష అనుభవిస్తూ నేరస్తులుగా మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడి చెడు మార్గాంలో వెళ్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా పిల్లల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యువత, విద్యార్థుల భవిషత్‌పై మాదకద్రవ్యాలు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని స్ఫష్టం చేశారు. చెడు సావాసాలతో యువత పెడదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. మత్తు పదార్థాల నిర్మూలనకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నిత్యం పిల్లల ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని తెలిపారు.ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని, టోల్‌ఫ్రీ నెంబర్ 100కు లేదా పోలీసులకు తెలియజేయాలని సిఐ సూచించారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న, అమ్ముతున్నా, సేవిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీసు సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.