కట్టు తప్పితే కటకటాలపాలే


నేర ప్రవృతి ఉంటే రౌడీ షీట్‌ తెరుస్తాం
కొత్తగూడెం :
పుట్టినరోజు వెడుకల పేరిట యువత మారణాయుధాలతో కేకులు కట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని త్రి టౌన్‌ సిఐ అబ్బయ్య హెచ్చరించారు. అక్రమంగా మారణాయుధాలు ఉన్నట్లు తెలిస్తే కటకటాల వెనక్కు పంపుతామని అన్నారు. గాజులరాజం బస్తీలో కొందరు యువకులు మారణాయుధాలతో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న హనుమంతులగుర్తు ప్రభాకర్‌, మిరియాల శ్రీకాంత్‌, సంగం సందీప్‌, కుతాడి భరత్‌, డిజె నవీన్‌, మాలోత్‌ సాయి, కె గోపి చంద్‌ అనే యువకులను అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రౌడీ గ్యాంగ్‌ లా ఏర్పడి కత్తులు, గొడ్డళ్లు, తల్వార్లు పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయపెడుతు డబ్బులు వసూలు చేసి జల్సాలు చేయాలని నిర్ణయించుకుని గత సంవత్సరం జనవరిలో జగడం సాయి గ్యాంగ్‌గా ఏర్పరుచుకొని 3 తల్వార్లను గుర్తుతెలియని వ్యక్తుల దగ్గర కొనుగోలు చేశారని అన్నారు. ఈ ఆయుధాలతో పోటోలు దిగి సోషల్‌ మీడియాలో పెట్టి వైరల్‌ చేస్తూ సామాన్య ప్రజలనుండి డబ్బులు వసూలు చేసి హత్య కేసులో జైలుకు వెళ్ళిన జగడం సాయిని బెయిల్‌పై బయటకు తీసుకురాడానికి ఈ ముఠా పథకం పన్నినట్లు వెళ్ళడిరచారు. కొత్తగూడెం కోర్టులో హాజరు పరచగా 14 రోజులపాటు జుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తు ఖమ్మం జైలుకు తరలించినట్లు తెలిపారు. మిరియాల శ్రీకాంత్‌ గుడుంబా శ్రీకాంత్‌, కుతాడి భరరక్షణ దగడు నవీన్‌, గోపిలపై గతంలో వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయని, నేర చరిత్రను పరిశీలించి రౌడీ షీట్‌ తెరుస్తామని అన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading