జిల్లాలో రెయిన్ అలర్ట్
ఖమ్మం : రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ తెలిపారు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ నుండి ఆర్డీవోలు, తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తహశీల్దార్లు, పోలీస్, పంచాయతీ, ఇర్రిగేషన్ అధికారులతో సమన్వయంతో పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ప్రమాదకరంగా మారిన కల్వర్టులు, క్యాజ్ వే లపై ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు. సమస్యలు తలెత్తే పరిస్థితి వస్తే గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లను అడ్డుగా పెట్టి రాకపోకలు నిషేధించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రధాన కార్యస్థానంలో ఉండేలా పర్యవేక్షణ చేయాలన్నారు.