చెడు వ్యసనాలకు దూంరగా ఉండాలి
ఎస్సై నాగ భిక్షం
కొత్తగూడెం : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మెరుగైన సమాజానికి పాటుపడాలని బూర్గంపహాడ్ ఎస్సై నాగ భిక్షం అన్నారు. ఐటీసీ ఎంఎస్‌కే, ప్రథమ్ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణ, రోడ్డు భద్రతా జాగ్రత్తలపై అవగాహన సదస్సు బూర్గంపహాడ్ ఎస్‌ఐ నాగ భిక్షం బృందంతో నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలు, అనర్ధాలు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. సరైన పత్రాలు, లైసెన్స్ లేకుండా ఎవరూ మోటారు వాహనాన్ని నడపడానికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు. పరిసరాల్లో ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు గమనిస్తే తక్షణం 100కు డయల్ చేయడం, దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. ఈ సదస్సుకు ఎఎస్సై సత్యం, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఐటీసీ ఎంఎస్‌కే ప్రథమ్ వొకేషనల్ సెంటర్ భద్రాచలం క్లస్టర్ హెడ్ నరేష్‌కుమార్, ఉపాధ్యాయులు, ఎలక్ట్రికల్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.