టిఎన్జీవో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అమరనేని రామారావు, కంచర్ల సాయి భార్గవ చైతన్య

భద్రాద్రి :   తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి నూతన కార్యవర్గం ఏర్పాటయింది. దీనికి ఎన్నికల అధికారిగా జి వీరబాబు  వ్యవహరించి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం ప్రకటించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా అమరనేని రామారావు, కార్యదర్శిగా కంచర్ల సాయి భార్గవ చైతన్య, అసోసియేట్ అధ్యక్షులుగా సిహెచ్ రామనర్సయ్య, కోశాధికారిగా జే సోమయ్య, ఉపాధ్యక్షులుగా గడ్డం ఉష, ఊటుకూరు నాగేశ్వరరావు, గొల్లమందల రమేష్, జాయింట్ సెక్రెటరీలుగా నవీన్, మాటేటి ఉష రాణి, కార్యవర్గ సభ్యులుగా టి అరుణ, మధుసూధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అమరనేని రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను జిల్లాలో పేద ప్రజలకు చేరేలా కృషి చేస్తామని అన్నారు. గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్య కార్యచరణతో ఉద్యోగస్తులకు రావలసిన అన్ని న్యాయబద్ధమైన విషయాలను కేంద్ర సంఘం ద్వారా ప్రభుత్వానికి విన్నవించి అందరికీ న్యాయం జరిగేలా చూడడంలో తమ వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమమే మా జెండా, ఎజెండా అని కొనియాడారు. కార్యదర్శి సాయి భార్గవ చైతన్య మాట్లాడుతూ గతంలో జీవో 317 ద్వారా చల్లా చెదురు అయిన కుటుంబాలను ఒకే దగ్గరకు తీసుకురావాలనే సంకల్పంతో నూతన ప్రభుత్వం అట్టి జీవోపై అధ్యయనం చేసి నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలని సదుద్దేశంతో ముగ్గురు సీనియర్ మంత్రులతో కమిటీని వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న మూడు డీఏల బకాయిలను, ఈ కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేపిచ్చేందుకు కేంద్ర సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో ఏర్పడిన సరికొత్త కార్యవర్గం ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వారి మన్ననలు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading