పార్టీ మారే ప్రసక్తే లేదు

అవాస్తవాలతో అయోమయానికి గురిచేయొద్దు

దుస్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్స్

కొత్తగూడెం :  పార్టీ మారుతామంటూ  దుస్ప్రచారం జరుగుతొందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని బిఆర్ ఎస్ కౌన్సిలర్స్ స్పష్టం చేశారు. ఇటీవల సీపీఐ నుంచి బిఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్స్ తిరిగి పార్టీ మారుతున్నారని జంప్ జిలానీలు అంటు కొని పత్రికల్లో రావడాన్ని వారు తీవ్రంగా  ఖండించారు. గురువారం బీ ఆర్ ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశం లో కౌన్సిలర్స్ వై శ్రీనివాసరెడ్డి , బోయిన విజయ్ కుమార్, మాచర్ల రాజకుమారి, నేరెళ్ల సమాఖ్య, సత్యనారాయణ చారీలు మాట్లాడారు. తప్పుడు వార్తలు, అభూత కల్పనలతో మా ప్రతిష్ట ను దెబ్బ తీస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీ సిద్దాంతం, మాజీ సీఎం కెసిఆర్ చేసిన అభివృద్ది వల్లనే తాము పార్టీ మారమని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు. అధికారంలో ఉన్న లేకున్న ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్స్ కౌడగని పరమెష్ యాదవ్, వేముల ప్రసాద్, బిఆర్ ఎస్ నాయకులు మొహమ్మద్ యూసఫ్, ఎం ఎ. రజాక్, పిడుగు శ్రీను, కూరపాటి సుధాకర్, మాచర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading