డిస్మిస్ కార్మికులకు గుడ్ న్యూస్
సింగరేణిలో డిస్మిస్ కార్మికులకు మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని ఐఆర్ అండ్ పిఎం జనరల్ మేనేజర్ (పర్సనల్) బి హనుమంతరావు అన్నారు. హైపర్ కమిటీ రివ్యూ చేసేందకు ఈనె 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కార్మికులకు సూచించారు. మాజీ సింగరేణి ఉద్యోగులు 2019 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు గైరహజారైన కేటగిరి 1కు చెందిన బదిలీ వర్కర్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సింగరేణి : సింగరేణిలో డిస్మిస్ కార్మికులకు మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని ఐఆర్ అండ్ పిఎం జనరల్ మేనేజర్ (పర్సనల్) బి హనుమంతరావు అన్నారు. హైపర్ కమిటీ రివ్యూ చేసేందకు ఈనె 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కార్మికులకు సూచించారు. మాజీ సింగరేణి ఉద్యోగులు 2019 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు గైరహజారైన కేటగిరి 1కు చెందిన బదిలీ వర్కర్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. మాజీ కార్మికుల వయోపరిమితి 2023 మార్చి 1 నాటికి 46 ఏళ్ళు అంతకంటే తక్కువ వయస్సు ఉండాలన్నారు. మాజీ కార్మికుడు ఐదు సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలలో కనీసం 100 మాస్టర్లు పూర్తిచేసి ఉండాలన్నారు. బదిలీ వర్కర్(యూజి) , కేటగిరి 1 కోసం తిరిగి నియామకానికి మెడికల్ ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు. మాజీ కార్మికులు మళ్లీ నియామకం పొందడానికి తమ దరఖాస్తులను నిర్దిష్ట ప్రొఫార్మా(ఎనెగ్జరీఫామ్-1)లో మాజీ ఉద్యోగి చివరిసారి పనిచేసిన సంబంధిత విభాగ అధిపతికి ఇవ్వాలన్నారు. ఒకవేళ గని మూతబడితే దరఖాస్తులను సింగరేణి ఉన్నతాధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు.