ఫోక్సో కేసులో 4ఏళ్ళ జైలు శిక్ష
ఫోక్సో కేసులో 4ఎళ్ళ జైలు శిక్ష

భద్రాద్రి : ఫోక్సో కేసులో వ్యక్తికి నాలుగు ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విదిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి (పొక్సో స్పెషల్ జడ్జ్) ఎం శ్యామ్ శ్రీ తీర్పు చెప్పారు. 2022 జూలై 27న జరిగిన ఈ సేసులో కోర్డు తీర్పు వెలువరిచింది. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన బొందుల వెంకటరమణ మైనరు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తల్లి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ ఎం రవికుమార్ దర్యాఫ్తు అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుత ఇన్స్పెక్టర్ డి రమేష్ కోర్టులో ఈకేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పది మంది సాక్షులను కోర్టు విచారించింది. నేరం రుజువు అయినట్లు భావించిన కోర్టు ఫోక్సో ఆక్ట్ సెక్షన్ 8 ప్రకారం నాలుగు ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రాసెక్యూషన్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ డి.లక్ష్మి, రావి విజయకుమార్, లైజాన్ ఆఫీసర్ ఎం హరి గోపాల్, పిఎస్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ వడ్డే నవీన్ సహకరించారు.