విస్పోటం మిగిల్చిన విషాదం
- ఆత్మీయులను కోల్పోయిన సమ్మేళనం
- ఇద్దరి మృతి, చిద్రమైన దేహాలు
- మృతులకు రూ 10లక్షలు, క్షతగాత్రులకు 2లక్షల ఎక్స్గ్రేషియ

ఖమ్మం : బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం మిగిల్చింది. నేతల అత్యుత్సాహం స్థానికుల పాలిట శాపంగా మారి ఇద్దరి ప్రాణాలను బలికొంది. బిఆర్‌ఎస్ నాయకుల అనోలోచిత చర్య అమాయకుల జీవితాలను చిన్నాభిన్నం అయ్యాయి. పది మందికిపైగా ప్రాణాలతో చెలగాటమాడారు అధికార పార్టీ నాయకులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలోని చీమలపహాడ్ గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ హాజరయ్యారు.
అయితే కార్యకర్తలు అత్యుత్సాహంతో పేల్చిన బాణాసంచా ఘోర అగ్ని ప్రమాదానికి కారణమైంది. ర్యాలీలో బాణాసంచా కాల్చడంతో పూరి గుడిసెకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగడంతో స్థానికులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటపలో బాణోత్ రమేష్, మంగు అనే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. అగ్రి ప్రమాదంలో సందీప్, తేజావత్ భాస్కర్, ఆంగోత్ కుమార్, ధర్మసూత్ లక్ష్మణ్, కారేపల్లి సిఐ అజ్మీర నవీన్, అజ్మీర హరిబాబుకు తీవ్రంగా గాయపడగా నరాటి వెంకన్న, తేళ్ల శ్రీనివాస్, బండి రామారావు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు తెగిపడి ఘటనా స్థలం అంతా రక్తసిక్తంగా మారింది.
క్షతగాత్రుల ఆర్తనాదాలు, ఆక్రందనలు మింన్నంటాయి. దీనితో ప్రాంగణం అంతా మాంసపు ముద్దలతో హృదయ విదారకంగా మారిన దుస్థితి. పోలీసులు హుటావుటిన క్షతగాత్రులను వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం నుండి ప్రజలు తేరుకునేలోపు ఘటనాస్థలం అంతా రుధిరస్థలిగా మారింది. ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ వెంటనే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో జరిగిన అగ్ని ప్రమాదంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అమ్ముకున్నాయి.
మృతులకు రూ 10లక్షల ఎక్గ్స్రేషియ : మంత్రి పువ్వాడ.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ10 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ2 లక్షల ఎక్స్గ్రేషియను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.ఈ ఘటనలో మఅతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి లో అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.
అన్ని విధాలా అండగా ఉంటాం : ఎంపి నామ

చీమలపాడు ఘటన పట్ల ఎంపి నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. పార్టీ కుటుంబ సభ్యులను పొగొట్టుకోవడం బాధించిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్యకర్తలకు పార్టీ తరఫున రూ 5లక్షలు ,గాయపడిన వారికి రూ 2 లక్షలు ఆర్థిక సాయం అందజేయడంతోపాటు నామ ముత్తయ్య ట్రస్ట్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ50 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు నామ వెల్ల డిరచారు .
గాయపడిన వారిని అవసరమైతే అత్యవసరంగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విషయమై డాక్టర్లతో నిత్యం సమాలోచనలు జరుపు తున్నట్లు తెలిపారు .ఘటన పట్ల చింతిస్తూ సంతాపసూచకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడిరచారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ సూచనల మేరకు కార్యకర్తలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మఅతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉండడడం తోపాటు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటుందని నామ తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాల్లో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలు కళ్ళముందు చనిపోవడం తమను ఎంతగానో బాధించిందన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటే శ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , కారేపల్లి మండల సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ,కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కారేపల్లి దేవస్థానం చైర్మన్ అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు .