బిఆర్‌ఎస్‌ బాస్‌కు పిఎస్‌ఆర్‌ బిగ్‌ షాక్‌..!

18న అమిత్‌షాతో పొంగులేటి భేటీ..?


భద్రాద్రి :
బిఆర్‌ఎస్‌ బిగ్‌ బాస్‌ సిఎం కెసిఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటకు కారు ఎక్కగానే అదే రోజు మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కారు దిగుతారాని జోరుగుగా ప్రచారం జరుగుతుంది. సిఎం కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌తో దేశ్‌కి నేతగా ఖిల్లాలో అడుగు పెట్టేందుకు సిద్దమైన సందర్భంగా పొంగులేటి బిజెపిలో చేరి ప్రతిపక్ష నేత హోదాలో గ్రాండ్‌ వెల్కమ్‌ కలుకుతారు అని రాజకీయ వర్గాల్లోని నేతలు చెవులు కొరుకుంటున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు సిఎం కెసిఆర్‌ ఈ నెల 18న ఖమ్మం వస్తుండగా అదే రోజురాజకీయ చాణికుడు అనే పేరున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పొంగులేటి కలుస్తారని తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం పిఎస్‌ఆర్‌ పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఖిల్లా కోడై కూస్తోంది. నేటినుండి కార్యకర్తలతోను, అభివానులు. అనుచరులో వరుస సమావేశాలు నిర్వహించి పార్టీ మారితే ఎదురయ్యే సవాళ్ళను, అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తారని తెలుస్తోంది ఈనేపధ్యంలో తన అనుచరగణాన్ని అందుకు తగినట్లుగా సన్నద్దం చేసినట్లు వినికిడి.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading