కార్మికుల నెత్తురు పీల్చే జలగల్లారా జాగ్రత్త

  •  విమర్శిస్తే సహించేది లేదు 
  • ఏఐటీయూసి నాయకులారా ఖాబర్దార్‌

కొత్తగూడెం : సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలలో ఎన్నికైన తర్వాత కార్మికుల సమస్యలు తీర్చడంలో మొకం చాటేసి, కార్మికులకు అందుబాటులో లేని ఏఐటీయూసి నాయకులు ఐఎన్‌టీయూసి నాయకులను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొత్తగూడెం ఐఎన్‌టీయూసి కార్యాలయంలో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సి త్యాగరాజన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ఈ నెల 12న జరగాల్సిన స్ట్రక్చర్‌ సమావేశానికి హాజరు అవ్వకుండా కార్మికుల సమస్యలపై ఏమీ మాట్లాడకుండానే వేణుదిరిగిన ఏఐటీయూసి నాయకులకు ఐఎన్‌టీయూసి సెక్రటరీ జనరల్‌, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌ని విమర్శించే హక్కులేదని ఘాటుగా విమర్శించారు. స్ట్రక్చర్‌ సమావేశంలో సింగరేణి అధికారులతో సమావేశమై కార్మికులకు రావాల్సిన లాబాల వాటా, కార్మికులకు సంబందించిన మారుపేర్ల సమస్య, వివిధ కారణాలతో డిస్మిస్‌ అయిన కార్మికుల సమస్య, మెడికల్‌ అన్ఫిట్‌, ట్రాన్స్ఫర్‌ పాలసి ఇంకా యితర సనస్యలు పరిష్కరించాల్సి ఉండగా చేతకాక తోక ముడిసి వెనుదిరిగి పారిపోయిన ఏఐటీయూసి నాయకులకుల్ని తమ సంఘం నేతలను విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

50 ఏళ్ళకు పైబడి కార్మిక రంగంలో విశిష్ట సేవలందిస్తూ, కార్మికుల మనసులను గెలుసుకున్న నాయకుడు, అనునిత్యం సింగరేణి కార్మికుల, ఉద్యోగుల, కాంట్రాక్టు ర్మికుల శ్రేయస్సుకు, సంస్థ మనుగడ కోసం శ్రమిస్తున్న కార్మిక నాయకుడు జనక్‌ ప్రసాద్‌ విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవ చేశారు. అనాదిగా సింగరేణి కార్మికుల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న జలగల్లా ఏఐటీయూసి నాయకులు తయారయ్యారని మండి పడ్డారు. భవిష్యత్తులో నిరాధారమైన విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆగ్రహించారు. కార్మికుల గుర్తింపు సంగంగా పట్టం కడితే వారి సమస్యల పరిస్కారానికి పాటుపడకుండా స్వలాభాపెక్షతో కార్మికులను, కళలను విస్మరించడం విచారకరం అన్నారు. గుర్తింపు సంఘం కార్మిక బండారం కార్మికులు, ఉద్యోగులు గమనిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు.

కార్మికుల కోపాగ్నికి బాలి అవ్వక తప్పదని,   ఏఐటీయూసి  యూనియన్‌ నాయకులకు  తగిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసి ప్రధాన కార్యదర్శి కేడం ఆల్బర్ట్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ బి రాజేశ్వర్‌ రావు,ఏరియా ఉపాధ్యక్షులు ఎండి రజాక్‌,కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌ పీతాంబర్‌ రావు,ఏరియా చీఫ్‌ ఆర్గనైసింగ్‌ సెక్రటరీ ఎస్‌ కె గౌస్‌, ఐఎన్‌టీయూసి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading