గొప్ప సంస్కరణవాది రాజీవ్ గాంధీ
పొంగులేటి క్యాంప్ ఆఫీస్ లో జయంతి వేడుకలు

కొత్తగూడెం: ప్రధానిగా రాజీవ్ దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారనీ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఆయన కుటుంబం మొత్తం దేశానికి, దేశ ప్రజల సేవలకే అంకితమైందన్నారు. ఐటీ, టెలికాం రంగాల పురోగతికి ఎనలేని కృషిని కొనియాడారు. ప్రధానిగా అనేక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధికి తోడ్పడ్డారని, దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, రాజీవ్ గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ మతిన్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్తి రెడ్డి, సుజాతనగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, సేయం నాయకులు చింతలపూడి రాజ శేఖర్,ప్రదీప్ దితరులు పాల్గొన్నారు.