సమస్యల సాధనకు హెచ్ఎంఎస్ పోరాటం
సమస్యల సాధనకు హెచ్ఎంఎస్ పోరాట
హీమీలు నిర్వేర్చడంలో గుర్తింపు సంఘం విఫలం
మోసపూరిత హామీలతో కార్మికుల ఓట్లు దండుకున్నారు
హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్

కొత్తగూడెం : సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కార్మికుల ఓట్లు దండుకున్నారని, హామీలు నిరవేర్చడంలో విఫలం అయ్యారని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు, జేబీసీసీ మెంబర్ రియాజ్ విమర్శించారు. కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి జేవిఆర్ఓసి నందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు, జేబీసీసీ మెంబర్ రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సుమారు 50 వాగ్దానాలు చేశారని, కానీ నేటి వరకు ఏ ఒక్క హామీ పరిష్కారం చేయలేక పోయారని విమర్శించారు. మాయ మాటలతో కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్న సంఘాలు కార్మికులకు లాబాదాయకమైన కార్యక్రమాలు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టాండర్డ్ మీటింగ్ లో జరిగిన చర్చల గురించి వేజ్ బోర్డులో జరిగిన చర్చల గురించి హెచ్ఎంఎస్ యూనియన్ చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఏరియాలో నెలకొన్న సమస్యలను పరిష్కార మార్గాలు, వాటి సాధన కార్యక్రమాలు హెచ్ఎంఎస్ నిత్యం చేపడుతుంది అన్నారు. హెచ్ ఎం ఎస్ కార్మిక పక్షాన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కొత్త ఉద్యోగాలు, బావులు సింగరేణి మనుగడ కోసం ప్రైవేటైజేషన్ కాకుండా కార్మిక శక్తిని కాపాదాటానికి హెచ్ ఎం ఎస్ ముందుండి కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. అందరూ సహకరించాలని, భవిష్యత్తు తరాలకు కంపెనీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్ గారితో పాటు ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు బ్రాంచ్ సెక్రెటరీ ఆసిఫ్ సత్తుపల్లి ఇన్చార్జ్ అజ్గర్ ఖాన్ కొత్తగూడెం ఏరియా మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ సాంబశివరావు సెంట్రల్ కమిటీ మెంబర్ నసీం ఖాన్ జేవిఆర్ఓసి ఫిట్ సెక్రెటరీ శ్రీనివాస్ సమంత సెక్రెటరీ నరసింహారావు మహేష్ కిష్టారం ఓసి సెక్రెటరీ మొగిలి కొత్తగూడెం ఆర్ సి ఎస్ పి సెక్రెటరీ పూర్ణచందర్ వీకే వర్క్ షాప్ సెక్రటరీ కరీం పి వి కే ఫై సెక్రెటరీ చిట్టిబాబు ఏరియా బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరానంద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలచందర్ రెడ్డి ఓల్డ్ సి ఎస్ పి సెక్రెటరీ షకీల్ ,ప్రవీణ్ ,కనకారావు ,మహేష్ పవన్ రమేష్,అలీమ్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్తుపల్లి డిస్పెన్సరీ లో సమస్యలను తెలుసుకొని సీఎం ఓని కలిసి మెమోరండం అందజేశారు. కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ని కలిసి అక్కడ సమస్యలు వివరించి వాటిని పరిష్కరించాలని కోరడం జరిగింది అదే రకంగా జీకే ఓసి నందు హెడ్ ఓవర్ మెన్ గా పనిచేసే శ్రీనివాసును ఇకనుంచి హెచ్ఎంఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కార్మిక సంక్షేమం విషయంలో రాజీ లేకుండా పోరాటం చేయాలని కోరారు.