తోడు దొంగల ఆరెస్టు


రూ 9లక్షల 44 వేలు రికవరీ చేసాం
ఎస్పీ జి వినీత్‌

భద్రాద్రి : సెలవులకు దూరప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జి వినీత్‌ జిల్లా ప్రలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు పాల్లడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్తగూడెం త్రీ టౌన్‌ పోలీసులు రైల్వే స్టేషన్‌ వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్‌ ఇర్ఫాన్‌, అజీమ్‌ పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ నేరాల వివరాలు వెల్లడిరచారు. ఈజీ మనీకి అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల నుండి 78 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలు,03 మొబైల్‌ ఫోన్లు, రూ 50 వేల నగదును స్వాధీపరుచుకున్నారు. గతంలో చల్లా వెంకట్‌ తన సోదరి అయిన గొర్రె వసంతకి ఇచ్చిన చోరి సొత్తు రూ 50 వేలు కూడా రికవరీ చేశారు. మునప్పురం హైదరాబాద్‌ నుండి 51 గ్రాములు, భద్రాచలం ముతూట్‌ నుండి 31 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేయవలసి ఉన్నదన్నారు. కొత్తగూడెం పట్టణం కూలిలైనకు చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ అలియాస్‌ చోటు మొదటిసారి 2012లో నాగరాజు హాస్పిటల్లో మొబైల్‌ దొంగతనం చేసి బాల నేరస్తుడిగా ఖమ్మంలో చిల్డ్రన్‌ హోమ్‌లో గడిపినాడు.

దొంగలతో ఏర్పడిన పరిచయాల వలన తాళాలు వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్‌ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరం మే నెలలో కొత్తగూడెం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనం చేస్తూ పట్టుబడి భద్రాచలం సబ్‌ జైలుకు పంపడం జరిగింది. అక్కడ ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌, పాల్వంచలో దొంగతనం కేసులలో నిందితుడిగా ఉన్న చల్లా వెంకట్‌ లతో పరిచయం ఏర్పడి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం జూన్‌ నెలలో షేక్‌ ఇర్ఫాన్‌, చల్లా వెంకట్‌ కలిసి కొత్తగూడెం పట్టణంలో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలలో కొన్ని విజయ్‌కు ఇవ్వగా అతను భద్రాచలంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి తిరిగి వీరికి నగదును ఇచ్చేవాడు. కొత్తగూడెం త్రీ టౌన్‌ పరిధిలోని గాజులు రాజాం బస్తీ, గణేష్‌ టెంపుల్‌ వీధిలో పాల్పడిన దొంగతనాలలో ఇర్ఫాన్‌తో పాటు ఇల్లందుకు చెందిన అజీమ్‌ కూడా ఉన్నాడు. ఇర్ఫాన్‌కు అజీమ్‌ బాల్యమిత్రుడు. ప్రస్తుతం అజీమ్‌ హైదరాబాదులో అమెజాన్లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇర్ఫాన్‌ అజీమ్‌ ద్వారా దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను హైదరాబాద్‌ మనప్పురంలో తాకట్టు పెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. మొత్తం చోరీకి గురైన సొత్తు విలువ రూ 13 లక్షలు కాగా ఇప్పటివరకు రూ 9 లక్షల 44,వేల సొమ్మును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఇద్దరిని జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం కోర్టునకు తరలించారు పోలీసులు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading