స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలి

  • ఐవైసి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ ఎస్విఎల్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు చీకటి కార్తీక్‌ పాల్గొన్నారు. సమావేశ అనంతరం చీకటి కార్తిక్‌ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పడటంలో యూత్‌ కాంగ్రెస్‌ కృషి మరువలేనిదని, రానున్న రోజుల్లో దేశ భవిష్యత్‌ యువతదేనని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, యూత్‌ కాంగ్రెస్‌ పటిష్టంగా పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయి అన్నారు.

ఈ సమావేశానికి చీకటి కార్మిక్‌తో పాటు జిల్లా జనరల్‌ సెక్రటరీలు మిత్ర, గులాం మతీన్‌, కసన బోయిన రామ్మూర్తి, కుంచం వెంకటేష్‌, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, కొత్తగూడెం టౌన్‌ ప్రెసిడెంట్‌ జయసూర్య, లక్ష్మీదేవిపల్లి మండల ప్రెసిడెంట్‌ ఈశ్వర్‌, చుంచుపల్లి మండల ప్రెసిడెంట్‌ అంతడుపుల శివకుమార్‌, భద్రాచలం నియోజకవర్గ వైస్‌ ప్రెసిడెంట్‌ గాడి విజయ్‌, భద్రాచలం మండల ప్రెసిడెంట్‌ వెంకట్‌ నాయుడు, సెక్రెటరీ భాను, ఇల్లందు నియోజక వర్గ వైస్‌ ప్రెసిడెంట్‌ ఈశం లక్ష్మణ్‌, మౌనిష్‌ గౌడ్‌, అజయ్‌, నాగేంద్ర, కృష్ణ ప్రసాద్‌, ఆనంద్‌, కార్తీక్‌ లు పాల్గొన్నారు,

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading