ఇంటర్‌లో హెడ్ కానిస్టేబుల్ కొడుక్కి స్టేట్ ర్యాంక్
- అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెం పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కొడుకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లిక్కి కోటేశ్వరరావు కుమారుడు లిక్కి విశ్రుత్ బుదశారం విడుదలైన ఇంటర్ మీడియట్ ఫలితాలలో 994 మార్కులు పొంది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ ఘనత సాధించిన విద్యార్థి విశ్రుత్ అతని కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.