ఢిల్లీలో విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ
- హాస్తినకు అగ్గి పెట్టెలో సిరిసిల్ల చేనేత చీర
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో ఏర్పాటు చేసిన వివిధతా కా అమృత్ ఉత్సవ్ ప్రారంభం కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డెఫ్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్‌లో చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను రాష్ట్రపతి వీక్షించారు.
అగ్గి పెట్టెలో పట్టేలా చేతితో చీర నేసిన సిరిసిల్ల నేతకారుల పనితీరును రాష్ట్రపతి ప్రముఖంగా నేసే విధానాన్ని అడిగి తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శించిన గుస్సాడి నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గత సంవత్సరం నుండి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్ ఉత్సవాలు జరుపుతున్నారు.భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని చాటి చెప్పటమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.