జాతీయ అథ్లెటిక్స్‌లో జిల్లా పోలీస్ అరుదైన ఘనత
- 1500 మీటర్ల పరుగు పందెంలో రజత పథకం
కొత్తగూడెం : కొత్తగూడెంకి చెందిన హెడ్ కానిస్టేబుల్ పి వీరభద్రం జాతీయ అథ్లెటిక్స్‌లో వెండి, రజత పథకాలను సాధించి జిల్లా పోలీసు శాఖకు వన్నె తెచ్చారు. కేరళ రాష్ట్రం కున్నం కులంలో సొమవారం జరిగిన 1500 మీటర్ల పరుగు పందెంలో మూడవ స్థానంలో నిలిచి రజత పథకం సాధించాడు. ఇటీవల జరిగిన 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 6న జరిగిన పోటీల్లో 1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5 కిలోమీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పథకాలు సాధించారు. ఓపెన్ క్యాటగిరీలో 50 ప్లస్ ఏజ్ గ్రూప్ కు నిర్వహించిన అథ్లెటిక్స్ లో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా వీరభద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనత సాధించారు. భద్రాద్రి కోతగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రోత్సఅహంతో జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఎంటి వింగ్ విభాగంలో పని చేస్తున్నారు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం.
సిఐ చెన్నూరి శ్రీనివాస్ వద్ద విధులు నిర్వహిస్తున్న వీరభద్రంకు సిఐ సహాయ సహకారం, ప్రోద్భలంతో రాష్ట్ర స్థాయిలో రాణించి జనవరి 31 నుండి ఈ నెల 3 వరకు కేరళలో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీలో అర్హత సాధించిన వీరభద్రం వెండి, రజత పథకాలు సాధించడంతో ఆయన్ను జిల్లా పోలీసు శాఖతో పాటు సహచర సిబ్బంది అభినందించారు.