మార్చ్ 22 నుండి జాతీయ స్థాయి ఊడ్ బాల్ పోటీలు
గూడెం క్రీడాకారుడు జేశ్వంత్ రాష్ట్ర జట్టుకు ఎంపిక

కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఆర్ జేశ్వంత్ రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో జరిగిన ఉడ్ బాల్ పోటీలో క్రీడాకారుడు ఆర్ జేశ్వంత్ ప్రతిభ చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుండి రెండు రోజులపాటు కర్నూల్ లో జరిగిన ఈ పోటీలకు కంబైన్డ్ టీంలో రాష్ర్ట జట్టు క్రీడాకారులు ప్రతిభ కనబతిచి విజయం సాధించి స్వర్ణ పతకం గెలుపొందారు.
ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్ జెశ్వంత్ జాతీయ స్థాయి ఉడ్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. మార్చ్ 22 నుండి 26 వరకు నాగపూర్ లో జరగనున్న జాతీయ స్థాయీ పోటీలలో పాల్గొననున్నారు. జాతీయ జట్టుకు ఎంపికైన ఆర్ జేశ్వంత్ ను ఉడ్ బాల్ రాష్ర్టకోచ్ సిరంజి ఫని కుమార్,అసోసియేషన్ ప్రెసిడెంట్ కె ఆదర్ష్, తోటి క్రీడాకారులు అభినందించారు.