ఆర్‌టిఐను పూర్తి స్తాయిలో అమలు చేయాలి
- సిఎండిని కలిసిన ఆర్‌టిఐ కమిటీ
కొత్తగూడెం: సింగరేణి సిఎండి బలరాం నాయక్‌ను సమాచార సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు బండ శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎండి బలరాం నాయక్‌కి సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సాధించాలని, సంస్థలో సమాచార చట్టం 2005 పూర్తీ స్థాయిలో అమలు చేయాలని ఈసందర్భంగా కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంపు, ఎస్‌సి,ఎస్టీ, వికలాంగుల కోటాకు చెందిన బ్యాక్ లాగ్ పోస్టులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీలను నోటిఫికేషన్ జారీ చేయాలని సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ ద్వారా కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వాసాలు మురళీ మోహన్, మాడపాటి.రేవంత్,గండ్ర. జితేందర్ రెడ్డి, ఎండి అంజాద్ పాషా తదితరులు పాల్గొన్నారు.