జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తిక్
- 15 వేల ఓట్లతో ఘన విజయం

కోతగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తిక్ ఎన్నికయ్యారు. ఇండియన్ యువత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో గత నెలరోజుల నుండి నెలకొన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరదింపుతూ ఐవైసి కార్తిక్ పేరును ప్రకటించింది. జిల్లా నుండి 12మంది ఈ పదవికి పోటీ పడగా చీకటి కార్తిక్ 15 వేల ఓట్లతో గెలుపొందారు. ఐవైసి ఆగస్టు 14 నుండి తెలంగాణ వ్యాప్తంగా యూత్ కాగ్రెస్ ఎన్నికలతోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నెలరోజుల పాటు చేపట్టింది. ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 4న విడుద చేసింది. అయితే సాంకేతిక కారణాలతో జిల్లా అధ్యక్ష పదవి మినహా అన్ని యూత్ కాంగ్రెస్ పదవులు ప్రకటించింది. జిల్లా అధ్యక్షపదవి ఫలితాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కార్తిక్ పేరును ఖరారు చేస్తూ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మంత్రి పొంగులేటి వర్గీయుల్లో ఆనందోత్సాహాం నెలకొంది. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్‌ను బలోపేతానికి కృషి చేస్తానని, తనపై నమ్మకంతో గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చీకటి కార్తిక్‌కు కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, నాగేంద్ర త్రివేధి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఐఎన్‌టియూసి ఏరియా వైస్ ప్రసిడెంట్ రజాక్, బాలిశేట్టి సుందర్‌రాజు, మసూద్, కెకె శ్రీను, సుందర్ కోరీ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సత్తి రెడ్డి, బాల పాసి, కూరపాటి రాజేష్, వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు.