ఔదార్యం చాటిన ఖమ్మం కలెక్టర్‌

  • దివ్యాంగురాలికి రూ లక్ష రుణ సహాయం

ఖమ్మం : జీవనోపాదికి పల్లీలు అమ్ముకుంటున్న ఓ దివ్యాంగురాలికి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ రూ లక్ష రుణం మంజూరు చేసి ఔదార్యాన్ని చాటి అందరినీ ఔరా అనిపంచారు. ఖమ్మం త్రీ టౌన్‌ జహీర్‌పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్‌ కమల కుటుంబ పోషణకు నాలుగు చక్రాల తోపుడు బండిపై పల్లీలు అమ్ముకుంటుంది. ఖమ్మం నగరంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ పర్యటిస్తున్న నేపధ్యంలో తోపడు బండిపై దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ అమ్మడాన్ని గమనించిన కలెక్టర్‌ ఆమె వద్ద కారులో ఆగారు. కలెక్టర్‌ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్‌ అని అమాయకంగా ఆడగటంతో ఓ చిరునవ్వు నవ్వారు కలెక్టర్‌. కమల కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అమ్మతో కలిసి ఉంటున్నాను సార్‌ అంటూ కుటుంబ పోషనకు తను పడుతున్న కష్టాలను, దుర్భర పరిస్థితిని వివరించింది. స్పందించిన కలెక్టర్‌ నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటా ఇచ్చి వెళ్లారు. తర్వాత కెఎంసి కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యకు ఫోన్‌ చేసిన కలెక్టర్‌ మలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్‌తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ లక్ష వ్యాపార రుణం చెక్కును గురువారం అందించారు. త్వరలో దివ్యాంగురాలు అయిన కమలతో కూరగాయాల వ్యాపారం పెట్టేందుకు ఏర్పాటుకు కార్యచరణ చేశారు. కలెక్టర్‌ స్పందించిన తీరును ఖమ్మం ప్రజలు వాప్‌ా వా కలెక్టర్‌ సాబ్‌ అంటూ తారీఫ్‌ చేస్తున్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading