అయ్యో బిడ్డా ..!

  • కన్న తల్లే కాష్టాలగడ్డలో వదిలేసింది
  • భద్రాచలంలోని శిశువు గృహానికి తరలింపు
  • దర్యాప్తు చేస్తున్న త్రిటౌన్‌ పోలీసులు

 

కొత్తగూడెం : తన శ్వాసతో బందమల్లిన తల్లి కని గంటల వ్యవధి గడవకముందే వద్దనుకుని వల్లకాడులో వదిలేసి వెల్ళిపోయింది ఆ మహా తల్లి. నవమాసాలు మోసిన ఆ మాతృమూర్తికి మనసు ఎలా ఒప్పిందో తేలియదు కానీ పేగు తెంచుకు పుట్టిన బంధాన్ని తెగతెలంపులు చేసుకుంది. కఠిన హృదయంతో పసికందును శ్మాశన వాటికలో వదిలేసిన దయనీయ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి వెచ్చని పొత్తిళ్ళలో కునుకు తీయాల్సిన నవజాత శిశువు క్షణాల్లోనే తల్లి స్పర్శకు దూరమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానికుల కథనం ప్రకారం న్యూగొల్లగూడెంలోని శాశన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు పనికందును వదిలేసి వెళ్ళడంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్చింది. ఉదయాన్నే శ్మాశన వాటిక నుంచి చిన్న పిల్లల ఏడ్పు వినిపించడంతో స్థానికులు కొందరూ ఘటనా స్థలానికి వెళ్లి చూడడంతో ఇస్తరాకులో శిశువు ఉండడం గమనించారు.

ఆ నవజాత శిశువు ఆక్రందనను చూసి అయ్యో బిడ్డా అని గుండెకు హత్తుకుని అక్కున చేర్చుకున్నారు. వెంటనే స్థానికులు త్రీటౌన్‌ పోలీసులతో కలిసి నవజాత శిశువును రామవరంలోని మతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. వైద్యులు శిశువుకు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడిరచారు. అయితే శిశువు గురువారం తెల్లవారుజామున జన్మించి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. అనంతరం ఐసిడిఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నవజాతశిశువును భద్రాలచంలోని శిశువు గృహానికి తరలించినట్లు డిపిపివో హరికుమారి తెలిపారు. త్రిటౌన్‌ పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా పసికందును చూసిన ప్రతి ఒక్కరు కంటికి రెప్పలా చూడాల్సిన కన్న తల్లి కాష్టాల గడ్డలో వదిలి వేయడం చూసి అయ్యో పాపం పసికందు కన్నీటి పర్యాంతం అయ్యారు. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలో కల్లోలం రేపింది.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading