రైలుకింద పడి యువకుడు మృతి
కొత్తగూడెం : గాజులగూడం, పాండురంగాపురం రైల్వే స్టేషన్ మధ్యన గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. వివరాలు ఆదివారం రాత్రి 9:00 గంలకు కెజి నెం. 70/9-10 వద్ద రైలు కిందపడటంతో తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినాడు. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జిఆర్‌పి ఎస్‌ఐ జే సురేష్, ఆర్పిఎఫ్ ఎఎస్‌ఐ జి నరసింహస్వామి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడివయసు సుమారు 28 సంవత్సరాలలోపు ఉంటుందని, ఒంటిపై సిమెంట్ రంగు టీ షర్టు, బ్లాక్ కలర్ పాయింట్, మెరూన్ కలర్ పుమా స్వెటర్ కలదని వివరాలు వెల్లడిరచారు. మృతునికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవని, మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు ఈ నెంబర్లకు 99890 2548, 87126 58600,970137 1472(ఆర్పిఎస్ ఎఎస్సై) సమాచారం ఇవ్వగలరని కోరారు.