కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యం

  • ఎన్నికల హామీల అమలుకు కృషి
  • ఐఎన్‌టియూసి సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌

ఖమ్మం : సత్తుపల్లి లోని జెవిఆర్‌ ఓసిలో కొత్తగూడెం ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ రజాక్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌, ఐఎన్‌టియూసి సెక్రెటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఐఎన్‌టియూసి కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం సహకారాలతో నెరవేరుస్తాము అన్నారు. త్వరలోనే ఉద్యోగులకు పేర్క్స్‌ మీద ఐటి మాఫీ, సొంత ఇంటి పదకం పై ప్రభుత్వంతో మాట్లాడి అమలుకు కృషి చేస్తా అన్నారు. 135 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్‌ ప్రజా పాలనలో తొలిసారి కార్మికులకు రూ 5వేలు లాభాలవాటా చెల్లించడం చారిత్రాత్మకమైన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో డిప్యూటి సిఎం వర్యులు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు కృషి ఫలితమే అన్నారు.

సింగరేణిలో కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అని స్పష్టం చేశారు. నూతన బొగ్గు గనుల ప్రారంభం, ఉద్యోగ కల్పన, అనుబంధ సంస్థల ప్రారంభానికి ఐఎన్‌టియూసి ఎల్లపుడూ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో ఉన్న కోటి ఇరవై లక్షల మంది కాంట్రాక్ట్‌ కార్మికుల వేతన పెంపు కోసం ఐఎల్‌వోతో పలు మార్లు సమావేశం నిర్వహించామని గుర్తుచేశారు. త్వరలోనే శాస్త్రీయ పరంగా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చారు. జెవిఆర్‌ఓసి ఉద్యోగులు, యూనియన్‌ నాయకులు , కాంట్రాక్ట్‌ కార్మికులు, సెక్యూరిటీ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా సన్మానించారు. అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ శాలేం రాజును కలిసి కార్మికుల సమస్యలపై చర్చించారు.

ఫిట్‌ సెక్రటరీ రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియూసి సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరసింహ రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ త్యాగరాజన్‌ , రీజినల సెక్రెటరీ ఆల్బర్ట్‌ , క్యాంపెయిన్‌ ఇంఛార్జి వికాస్‌ కుమార్‌, కాలం నాగభూషణం,కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీతంబరం, రావి నాగేశ్వరరావు , యూనియన్‌ నాయకులు చెన్నకేశవరావు, బట్టి విక్రమార్క, తీగల క్రాంతికుమార్‌, ఎస్కే గౌస్‌, సీతారామరాజు,నాగ ప్రకాష్‌, బాలాజీ, నాగేశ్వరరావు , కాసర్ల సమ్మయ్య, ప్రసన్న , కిరణ్‌ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading