అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి
- జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా
కొత్తగూడెం : తెలుగు విశ్వవిద్యాలయాన్ని పొట్టి శ్రీరాములు పేరు యధావిదంగా కొనసాగించాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రవేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విశ్వ మహా ఆగస్టు 4న సిఎంను విజ్ఞప్తి చేశామన్నారు. అయినప్పటికీ శుక్రవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలియజేస్తున్నట్టు వార్తలు వస్తున్నయి అన్నారు. ఈ నేపధ్యంలో విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు బదులుగా సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని యోచించడం ఎంత మాత్రం సరికాదన్నారు. భాష ప్రయాయుక్త రాష్ట్రాల్లో ఏర్పాటులో పొట్టి శ్రీరాములు చేసిన త్యాగని గుర్తుగా తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన ఆయన పేరు కొనసాగించాలని దారా రమేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారి ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం సాధించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు కొనసాగించి భావితరాలకు సూర్తిని నింపేలా గౌరవిద్దామన్నారు. సూరవరం ప్రతాపరెడ్డి తెలంగాణకు అందించిన సేవలు చిరస్పనీయమని కానీ ప్రతాప్ రెడ్డి గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదని పేర్కొన్నారు.