ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలి

పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి
ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం

కొత్తగూడెం :  జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, డిగ్రీ విద్యార్థులకు తెలుగు అకాడమిక్ బుక్స్ సకాలంలో ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం డిమాండ్ చేశారు.  లక్ష్మీదేవిపల్లి మండలం  శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల్లో మంచినీరు, వాష్రూమ్స్ సదుపాయం కల్పించాలన్నారు.  గత మూడు ఏళ్లుగా విద్యార్థులకి అందవలసిన స్కాలర్షిషిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. కళాశాల మౌలిక సదుపాయాల కోసం, కళాశాలలో స్థానిక సమస్యల మీద పని చేసేందుకు నూతన కళాశాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల అధ్యక్ష,కార్యదర్శులుగా హర్షవర్ధన్, మనోజ్ కుమార్ మరో ఆరుగురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్

కళాశాలలోని కార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు సీజనల్ ఆరోగ్య సమస్యల రీత్యా హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలన్నారు. ప్రతిరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులు అనేక ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు సీజనల్ వ్యాధుల కారణంగా జనాలతో కిక్కిరవడంతో విద్యార్థులకు సరైన వైద్యం అందక  అనారోగ్యపాలై నెలలు పాటు విద్యకు దూరం ఆవుతున్నారని ఆవేదన చెందారు. స్థానిక వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ సమావేశంలో కళాశాల కమిటీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading