నేడు గ్లోబల్‌ టైగర్‌ డే !

  • పులుల సంఖ్య రెట్టింపే లక్ష్యం
  • ప్రపంచంతో పోల్చితే భారత్‌లోనే 70శాతం పులులు
  • దేశంలో 6శాతం వృద్ధి రేటు


భద్రాద్రి : ఆ నడకలో రాజసం..! చూపులో గాంభీర్యం, వేటలో వేగం, అంతే కాదు అది గర్జిస్తే అడవికి రారాజైనా బెదరాల్సిందే అంటే అతిశయోక్తికాదు. ఈభూమి మీదనే అంతటి శక్తి వంతమైన జీవి. అంతెందుకు గ్లోబైలైజేషన్‌ యుగంలోను మానవుడు ఆజంతువుతో పోల్చితే ఉప్పొంగి పోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆ జీవి ఏంటీ అనుకుంటున్నారా అదే అండి పెద్ద పులి. గర్జిస్తే ఒక్కోసారి సింహాలైనా భయపడాల్సిందే. అలాంటి ఆ వన్యప్రాణులకు ప్రాణసంకటం తప్పటం లేదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద పిల్లి జాతికి చెందినవి పులులు. అయితే కాలానుగుణంగా అంతరించిపోతున్న పెద్ద పులులను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం(గ్లోబల్‌ టైగర్‌ డే)గా ప్రపంచ దేశాలు జరుపుతున్నాయి.

  • గ్లోబల్‌ టైగర్‌ డే చరిత్ర

2010  రష్యాలోని సెయింట్‌ పీటర్బ్సర్గ్‌లో టైగర్‌ సమ్మిట్‌ సందర్భంగా గ్లోబల్‌ టైగర్‌ ఇనిషియేటివ్‌ (జిటిఐ) నిర్వహించాయి. ఈ సదస్సులో ప్రధానంగా13 టైగర్‌ రేంజ్‌ కంట్రీస్‌తో(టిఆర్‌సి) పాటు అంతర్జాతీయ సంస్థలు పులుల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా సమావేశం అయ్యాయి. అప్పటి నుండి ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ టైగర్‌ సమ్మిట్‌లో ు ఞ 2ను ఆమోదించాయి. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే ప్రపంచ లక్ష్యం. పులులను తొమ్మిది ఉపజాతులుగా వర్గీకరించారు. వీటిలో మూడు (బాలి, కాస్పియన్‌, జావాన్‌) ఇప్పటికే అంతరించి పోయాయి. జీవించి ఉన్న ఉపజాతులు మలయన్‌, సుమాత్రన్‌, దక్షిణ చైనా, ఇండోచైనీస్‌, బెంగాల్‌, అముర్‌ (సైబీరియన్‌) పులులు. డబ్ల్యూసిఎస్‌ వాటిలో 50శాతానికి పైగా రక్షించడానికి స్థానిక ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. సుమాత్రన్‌. పులులలో అతి చిన్నవి అయినప్పటికీ, మగవి కేవలం 300 పౌండ్ల బరువు కలిగి ఉంటాయి. దురదృష్టవ శాత్తూ  వాటిలో చాలా మిగిలి లేవు.

T x 2 అంటే ?

శతాబ్దం క్రితం భూమి మీద బహుశా లక్షకు పైగా పులులు తిరుగాడేవి. 21 వ శతాబ్దం ప్రారంభం నాటికి ప్రబలమైన వేట, ఆవాసాల పేరుతో మనుషులు చేసిన ప్రకృతి విధ్వంసం కారణంగా పులుల సంఖ్య 95శాతం క్షీణించింది. పులులు ఒకప్పుడు ఆసియా అంతటా విస్తఅతంగా ఉండేవి. కానీ దశాబ్దాల కాలంలో వాటి జనాభా కేవలం 13 దేశాలకు పరిమితం అయ్యింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, భూటాన్‌, చైనా, భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌, నేపాల్‌, రష్యా, థాయిలాండ్‌లో పులులు ఉండగా కంబోడియా, లావో పిడిఆర్‌, వియత్నాంలో పులులు స్థానికంగా అంతరించి పోయాయి. పులుల సంఖ్య 2010లో 3,200కు క్షీణించడంతో సెయింట్‌ పీటర్బ్సర్గ్‌ టైగర్‌ సమ్మిట్‌ లో 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని, అనంతరం చైనీస్‌ టైగర్‌ సంవత్సరంగా పరిగణించాలంటూ 13 దేశాలు కలిసి అపూర్వమైన లక్ష్యాన్ని సాధించేలా ఒప్పందం చేసుకున్నాయి.

  • పులుల సంరక్షణలో భారతదేశం కృషి

వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 లోని నిబంధనల ప్రకారం నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టిసిఎ) ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సంస్థ ఉంటుంది. 2006లో సవరించినట్లుగా, పులుల సంరక్షణను బలోపేతం చేసేందుకు 2006లో చట్టంలోని నిబందనలో మార్పులు చేసింది. ప్రపంచంలో గుర్తించిన 63 పులుల అభయరణ్యాలలో 35 భారతదేశంలో ఉన్నాయి, ప్రపంలోని మొత్తం పులుల సంఖ్యలో 70శాతం పైగా పులులు దేశంలో నివసిస్తుండటం గమనార్హం.

  • ప్రాజెక్ట్‌ టైగర్‌

ప్రాజెక్ట్‌ టైగర్‌ 1973 ఏప్రిల్లో ప్రారంభం అయ్యింది. ఇది మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెట్‌, ఫారెస్ట్‌ అండ్‌ క్లైమెట్‌ చేంజ్‌ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది.కేంద్ర ప్రాయోజిత పథకం (సిఎస్‌ఎస్‌) ద్వారా ‘‘శాస్త్రీయ, ఆర్థిక, సాంస్కఅతిక, పర్యావరణ విలువలు, జీవ ప్రాముఖ్యత కలిగిని ప్రాంతాల సంరక్షణతో పాటు పులుల సంరక్షణ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. గత యాభై ఏళ్ళలో ప్రాజెక్ట్‌ టైగర్‌ పులుల సంరక్షణలో గణనీయమైన పురోగతిని సాధించడంలో విజయవంతమైంది. ప్రారంభంలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న తొమ్మిది పులుల అభయారణ్యాలను కవర్‌ చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌ 53 అభయారణ్యాలలో 75,796 చదరపు కిలోమీటర్ల మేరా విస్తరించింది. ప్రాజెక్ట్‌ టైగర్‌ భారతదేశ మొత్తం భూభాగంలో 2.3శాతం విస్తీర్ణం కలిగి ఉంది.

  • దేశంలో పులుల అభయారణ్యాలు

భారతదేశంలో 53 పులుల అభయారణ్యాలు ఉన్నాయి. పులుల సంరక్షణ సమర్థవంతంగా నిర్వహించేలా ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించారు. భారతదేశంలోని 14 పులుల అభయారణ్యాలకు టైగర్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం గ్లోబల్‌ కన్జర్వేషన్‌ గుర్తింపు లభించింది. అస్సాంలోని మానస్‌, కాజీరంగా అండ్‌ ఒరాంగ్‌, మధ్యప్రదేశ్లోని సత్పురా, కన్హా అండ్‌ పన్నా, మహారాష్ట్రలోని పెంచ్‌, బీహార్లోని వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌, ఉత్తర ప్రదేశ్లోని దుధ్వా, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్‌, కేరళలోని పరంబికులం, కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌, తమిళనాడులోని ముదుమలై అండ్‌ అనామలై టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులు ఉన్నాయి.

  • పులుల లెక్కింపు

నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ రాష్ట్ర అటవీ విభాగాలు, వైల్డ్‌ లైఫ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పులుల పరిరక్షణ భాగస్వాముల సహకారంతో పులులు సహ ప్రెడేటర్లు, వేట, వాటి ఆవాసాల స్థితి గతుల కోసం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జాతీయ అంచనా తయారు చేస్తారు. మానవ వేలిముద్రల మాదిరిగానే, ప్రతి పులికి ప్రత్యేకమైన చారలు ఉంటాయి. పులులను గుర్తించడానికి, వాటి సంఖ్యలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలకు ఈ ప్రత్యేకమైన కోర్‌ సహాయపడతాయి. ఈ శాస్త్రీయ పద్దతి ఆధారంగా మొదటి సారి 2006లో 1411పులులు ఉన్నట్లు అంచనా వేశారు. అప్పటి నుండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి పులుల సంఖ్య లెక్కింపు జరుగుతుంది. అయితే 2006నుండి 2018 వరకు ప్రతి యానంకు పులుల సంఖ్య 6శాతం పెరిగింది.

1 thought on “నేడు గ్లోబల్‌ టైగర్‌ డే !

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading